జే ఎన్ యూ దాడితో ఏ చోటూ సురక్షితం కాదని మరోసారి స్పష్టం.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
అపూర్వానంద్

రోజురోజుకీ అధికార పార్టీ హింసాత్మక విధానాలు ప్రతిచోటకీ విస్తరిస్తున్నాయి.ప్రభుత్వం మనందరినీ తెలివితక్కువ దద్దమ్మలనుకుంటోందా?. ప్రభుత్వం తరపు నుంచి మానవ వనరుల శాఖా మంత్రి జే ఎన్ యూ లో శాంతియుత వాతావరణానికై ప్రయత్నించమని అప్పీల్ చేయడం,హోం మంత్రేమో క్యాంపస్లో హింస గురించి పోలీసుల రిపోర్టు కోరడం మనం చూసాం. దేశం మొత్తానికి అధికార కేంద్రమైన ఢిల్లీలో కర్రలూ,రాడ్లతో వచ్చిన గూండాలు మూడు గంటల పాటూ జే ఎన్ యూ లో అల్లకల్లోలం సృష్టించడం ప్రభుత్వ అలసత్వాన్ని తెలియజేస్తోందా లేక ఇంకేదైనా కారణం ఉందా?.

మంత్రి గారూ,శాంతియుత వాతావరణం నెలకొల్పే బాధ్యత విద్యార్థులపై ఉండదు. హింసాత్మక విధానాలు అవలంబిస్తున్న మీరూ,మీ పార్టీకి ఆ బాధ్యత ఉంటుంది. గత ఐదేళ్లుగా జే ఎన్ యూ పై జరుగుతున్న దాడుల పర్వానికి కొనసాగింపే నిన్నటి సంఘటనలు కూడా.

ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో CAA ఈవెంటుని అడ్డుకోవడం మన దేశంలో డిబేట్లకి అనుకూలించే పరిస్థితులు తగ్గటాన్ని సూచిస్తోంది.

ఆయుధాలతో వచ్చిన గూండాలు క్యాంపస్లో అల్లకల్లోలం సృష్టిస్తోంటే చోద్యం చూసిన పోలీసుల నుంచి హోం మంత్రి రిపోర్ట్ కోరుతున్నారు. ఇదే పోలీసులు జామియాలో మాత్రం హింసని ఆపడానికి అవధుల్లేకుండా విజృంభించారు. మరి ఇక్కడ యోగేంద్ర యాదవ్ పై దాడి జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఎందుకున్నారు?.

పోలీసులకి పైనుంచి జేఎన్యూ టీచర్స్ ఎసోసియేషన్ మీటింగ్ ని చెదరగొట్టి అక్కడి విద్యార్థులు,సిబ్బందిని భయకంపితులని చేయాల్సిందిగా ఆర్డర్స్ వచ్చి ఉంటాయా?. అక్కడ హింస జరుగుతున్నట్టు ఫోటోలు బయటకి రిలీజ్ చేయడం ద్వారా ప్రభుత్వం తన పరిపాలనలో హింస ఏ విధంగా ఓ భాగమైందో తెలియజేయాలనుకుంటోంది. తద్వారా తన విధానాలని వ్యతిరేకించే వారందరినీ భయపెట్టే వ్యూహం ఉంది.

జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏ మంత్రిత్వ శాఖైతే తమపై మూడు గంటల పాటూ దాడులు జరిగినా పట్టించుకోలేదో దానికే ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా వారికి తెలీకుండానే జరిగిందనుకోవాలా?.

ఈ గూండాలు అంతా ఎవరు? వాళ్లంతా ఎ.బి.వి.పి.కి చెందినవారే అనలేము. కానీ దాడి జరిగిన వెంటనే జే ఎన్ యూ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ద్వారా మనకి ఓ విషయం అర్థమౌతుంది.

ఏబీవీపీనా,భజరంగ్దళ్ వారా అనే విషయంపై మాకూ స్పష్టత లేదు. వారు నన్ను ఏబీవీపీకి మద్దతుదారా అని ప్రశ్నించారు. నేను ఎటూ తేల్చని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏబీవీపీ గూండాలు విద్యార్థులు,ప్రొఫెసర్లపై దాడులు చేస్తున్నారని తెలియగానే మేము యూనివర్సిటీకి బయలుదేరాం.  కానీ పోలీసులు ఆ దారి మూసేసి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని అబద్ధం చెప్పారు.

మేము ఇంకోచోట కారు పార్క్ చేసి మరో గేటు దగ్గరికి వెళ్లాం. అక్కడ రెండు పోలీసు బస్సుల్లో సుమారు 50-70 మంది దాకా పోలీసులతో పాటు సివిల్ దుస్తులు ధరించిన మరికొందరూ ఉన్నారు. పోలీసులు లోపల గొడవలు జరుగుతున్నాయని మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. ముసుగుల్లో వచ్చిన గూండాలు దాడులు చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయని,మీరు వెళ్లి యాక్షన్ తీసుకోండి అని మేము పోలీసులతో చెప్పినా ఫలితం లేకపోయింది.

నేను ఈ ప్రశ్నలన్నీ అడగడం గమనించిన ఒకాయన నన్ను ఏబీవీపీకి మీరు మద్దతిస్తారా అనడిగారు. నేను ఎవరికీ సపోర్ట్ చేయనని చెప్పగానే అతను గర్వంతో  “లోపల వాళ్లని కర్రలతో కొడుతున్నారు” అన్నాడు. వాళ్లకి అలా అలా జరగాల్సిందేనని కూడా అభిప్రాయపడ్డాడు. అతని లాంటి గూండాలు మరికొందరు నన్నూ,నా భర్తని చుట్టుముట్టి “ఈమె వారి మద్దతుదారు,వీడియోలు తీస్తోంది” అనసాగారు.

మాకు చాలా భయం వేసింది. వారు గనక మాపై దాడి చేసినా పోలీసులు ఏం చేసేలా లేరని అర్థమవ్వడంతో అక్కడినుంచి మా కారు పార్క్ చేసిన చోటకి బయలుదేరాం. అప్పుడే మాకు కర్రలూ,లాఠీలు పట్టుకున్న సుమారు 100-150 మంది గుంపు క్యాంపస్ లో నుంచి బయటకొచ్చి పోలీసుల పక్కనే నిలబడడం కనిపించింది. వాళ్ల చేతుల్లో ఆయుధాలున్నా కూడా పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. ఈ హింస అంతా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరిగింది.

దాడులు చేసిన గూండాలలో కనీసం ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోవడం మీకు షాక్ అనిపించడం లేదా?. పోలీసుల సహాయంతోనే వారు తప్పించుకున్నారా?. పోలీసులు అడ్మినిస్ట్రేషన్ తో కుమ్మక్కై జామియాలో విద్యార్థుల మధ్య గొడవలు హింసాత్మకంగా మారాయనే అబద్ధాన్ని మీడియాలో ప్రచారం చేసాయా?.

ఆదివారం జేఎన్యూలో జరిగిన సంఘటనలు మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడిందో తెలియజేస్తున్నాయి. ఇది కేవలం జే ఎన్ యూ అంతర్గత విషయమే ఐనా మనందరికీ కూడా వర్తిస్తుంది. గూండాల రాజ్యంలో మనం ఉన్నామనీ,వారు చెప్పిందే చేసి తీరాలనీ,చెప్పుచేతల్లో బతకాలనీ మనకి స్పష్టంగా చెబుతున్నారు. సాక్షాత్తూ హోం మంత్రే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసేవారి చెవులు బద్దలయ్యేలా భారత్ మాతా కీ జై అని నినదించాల్సిందిగా తన మిత్రులని కోరడంతోనే తెలిసిపోతోందిగా ఆ విషయం?.

జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు ఆశిష్ ఘోష్,ప్రొఫెసర్ సుచరితా సేన్ ల మొహాలపై ఉన్న రక్తం మరకలే హింస ఎంతమేరకు మన దేశ పరిపాలనలోకి చొచ్చుకుపోయిందనే చేదు నిజాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కొని,తదుపరి కార్యాచరణేదో నిర్ణయించుకోవాలి.

RELATED ARTICLES

Latest Updates