కులోన్మాద నేరాలకి కులపరమైన శిక్షలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
సుజాత సూరేపల్లి.

దిశా కేసుతో పోలిస్తే మిగతా కేసులన్నింట్లో మీడియా,ప్రజల స్పందనలో చాలా తేడా ఉంది. డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ గారు ఈ దేశంలో ఏవైపు చూసినా కులం అనే రాక్షసి ప్రతీ దారిలోనూ ఎదురుపడుతుందంటారు. దశాబ్దాలుగా కుల వివక్షని అనుభవిస్తున్న వారందరికీ ఇది ప్రతిచోటా అనుభవమే. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా రోజుకో కొత్త రకమైన వివక్ష బయటపడుతూనే ఉంది. కులనిర్మూలన సంగతి అటుంచి అదే కులభావనని ఇంకా బలోపేతం చేసే పరిస్థితులు నేడు మనకి కనిపిస్తున్నాయి.

ఇండియాలో కులం అనేది రేప్ కల్చర్ లాగా ప్రజల్ని విభజించే ఓ దుర్మార్గమైన భావన. ప్రజల్ని విభజించేది ఏదైనా ఉంటే అవి అనైతిక కార్యకలాపాలు మాత్రమే. నేరస్తులని మాత్రమే ప్రజల నుంచి వేరుగా చూడాలి. ఇండియాలో కొన్ని అగ్రకులాలు మాత్రమే కులాన్ని తమ విలువైన ఆభరణంగా భావిస్తూ,తాము ఎక్కువ జ్ఞానం సంపాదించాం కాబట్టి ఎక్కువ పవిత్రులమనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇండియాలో కులం మాత్రమే రియాలిటీ. నేరాలు,సంక్షేమ పథకాలు,న్యాయవ్యవస్థ,విద్యా సదుపాయాలు,ఉద్యోగాలు,జర్నలిజం ఇలా ప్రతి చోటకీ కులం విస్తరించింది.

వెనుకబడిన,అంటరాని కులాలు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి గురవ్వాల్సి వస్తుందోననే భయంతో బతుకుతున్నారు‌. కొన్ని తరాలుగా అగ్రకులాల పాలకులు వీరిని అత్యంత దారుణమైన,కష్టమైన పనులని చేయించుకుని అన్ని విధాలుగా  వారికి లభించాల్సిన విద్యా,వైద్య సదుపాయాలని కూడా దక్కకుండా చేసారు‌. బానిసల కంటే హీనంగా చూసారు. ఈ అరాచకాలని ఎదుర్కోవాలంటే ఆ అణచివేయబడిన కులాల వారంతా కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది.

ఉన్నావ్,దిశా కేసులు ఈమధ్య మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. 2019 నవంబర్ 27 న దిశా అనే ఓ యువ వెటర్నరీ డాక్టర్ రేప్ కి గురై చంపబడింది. అందరూ ఒకేసారి ఈ సమస్యపై దృష్టి సారించారు. ఇంతకంటే ప్రాచుర్యం పొందిన నిర్భయ కేసు తర్వాత కూడా ఇండియాలో రేపులు తగ్గలేదు సరికదా నిందితులు ఆయా ఆకృత్యాలని ఫోన్లలో రికార్డ్ చేసి మరీ సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు.ఇదేనా నిర్భయ చట్టం వల్ల ఉపయోగం?.

దిశా కేసులో నలుగురు నిందితులని పోలీసులు డిసెంబర్ 16 న ఎన్కౌంటర్ చేసేదాకా ప్రజలంతా కొవ్వొత్తుల ర్యాలీలూ,ధర్నాలలో పాల్గొనడం,టీవీ ఛానల్లలో డిబేట్లూ చూసాం.

దిశా చంపబడిన రోజు రాత్రే వరంగల్ శివారులోని శాయంపేట వద్ద మానస యాదవ్ అనే యువతి మృతదేహం కూడా లభించింది.  ఈ వార్తని మీడియా అంత సీరియస్గా తీసుకోలేదు‌. మానస బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ తో బయటకి వెళ్లి చనిపోయిందని రాసారు. మా నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో బాయ్ ఫ్రెండ్ తన వస్త్రాలని మార్చి నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లినట్టుగా తెలిసింది.

నవంబర్ 24 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లా పతార్ గ్రామంలో సమత(టేకు లక్ష్మి) అనే మహిళని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా చంపేసారు. ఒంటినిండా గాయాలతో ఆమె మృతదేహం లభించింది. సమతది షెడ్యూల్ కులాల కేటగిరీకి చెందిన బుడగజంగం ఫ్యామిలీ. సమత దువ్వెనలు,పాత్రలు అమ్ముకొని జీవించే మహిళ. మొదట సమత అసలు పేరుతోనే మీడియా ఆమె గురించిన వార్తలు ప్రచారం చేసింది. దిశా కేసులో బాధితురాలి పేరుని తర్వాత మార్చినా ఆ కేసు రెడ్డి సర్ నేమ్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. దళిత సంస్థలూ,యాక్టివిస్టులూ నిలదీయడంతో లక్ష్మి పేరుని సమతగా మార్చారు. ఐనా కూడా మీడియా ఈ కేసుపై అసలు ఇంట్రెస్టే చూపించలేదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు కృష్ణ మాదిగ చొరవతో ప్రభుత్వం నుంచి బాధితురాలి భర్తకి ఉద్యోగం,ఇద్దరు పిల్లలకి మంచి విద్యతో పాటూ కొంత కాంపెన్సేషన్ కూడా ఎనౌన్స్ చేసారు.

నిర్భయ రేప్ సమయంలో కూడా సమత లాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ మీడియా అన్ని కేసుల పైనా సమానంగా శ్రద్ధ చూపడం లేదు. తమపై వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుందని గమనించిన ప్రభుత్వం డిసెంబర్ 6 న ఉదయం మూడున్నర సమయంలో దిశా కేసు నిందితులని పోలీసులతో ఎన్కౌంటర్ చేయించింది. పోలీసులు తాము ఆత్మరక్షణ కోసం చంపాల్సి వచ్చిందని చెప్పినా ఇండియాలో ఇలాంటి ఎన్కౌంటర్స్ అన్నీ ప్రభుత్వం చేయించే హత్యలే అనే విషయం అందరికీ తెలిసిందే.

మర్డర్లు,రేపులకి సంబంధించిన అరెస్టులూ, శిక్షలనై మనం కులపరమైన విశ్లేషణ చేస్తే జైల్లలో మగ్గుతున్న వారిలో వెనుకబడిన కులాల వారు,ఆదివాసీలూ,మైనారిటీలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. న్యాయపరంగా గానీ,ఎన్కౌంటర్లలో గానీ చంపబడేది వారే. హత్యలకీ,రేపులకీ గురయ్యేదీ వారే.

బియ్యం దొంగలించాడని చంపబడిన ఆదీవాసీ బాలుడు మధు నుంచి,ఆయేషా మీరా కేసులో ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన సత్యం బాబు దాకా అందరూ అణగారిన వర్గాల వారే. డిసెంబర్ 6 న ఎన్కౌంటర్ చేయబడిన వాళ్లవీ విద్యకి నోచుకోని చాలా పేద కుటుంబాలే. వారిది కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా. ప్రధాన నిందితుడు ఆలీ తప్ప మిగతా వారంతా ఇరవై ఏళ్ల లోపు వారే. పూర్తి విచారణ చేయకుండానే వారే నేరస్తులని నిర్థారణ చేసారు. ఒకవేళ అదే నిజమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికి ఉంది?,పోలీసులకా?. వారి స్థానంలో సామాజికంగా,ఆర్థికంగా బలమైన కుటుంబాల వారున్నా ఇలాగే ఎన్కౌంటర్ చేసేవారా?. ఎవరైనా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా?.

కులం అనేది రెండు వైపులా పదునున్న కత్తి. సామాజిక/కులపరమైన హోదా నేరాలలోనూ,ఆ నేరాలకి వ్యవస్థ విధించే శిక్షల్లోనూ ప్రతిఫలిస్తుంది. ఒకటో,రెండో ఎక్సెప్షన్స్ ఉండొచ్చునేమో అంతేగానీ దాదాపు చాలా సందర్భాల్లో జరిగేది మాత్రం అదే.

RELATED ARTICLES

Latest Updates