అక్రమంగా లాభాలు దండుకున్న అదానీ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for అక్రమంగా లాభాలు దండుకున్న అదానీ!"– ఫ్లాట్‌ కొనుగోలుదారులకు దక్కని పన్ను మినహాయింపు
– రూ.వెయ్యి కోట్ల హౌసింగ్‌ ప్రాజెక్టులో అవకతవకలు
– భారీగా పెనాల్టీలు విధించిన ‘నేషనల్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ’

న్యూఢిల్లీ : హర్యానాలో వెయ్యికోట్ల రూపాయలతో తలపెట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో అదానీ రియాల్టీ (అదానీ గ్రూప్‌నకు చెందినది) భారీగా అక్రమాలకు పాల్పడిందని ‘నేషనల్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ’ (ఎన్‌ఏఏ) విచారణలో తేలింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి జీఎస్టీలో ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ను పొందిన అదానీ రియాల్టీ, ఆమేరకు పన్ను లబ్దిని ఫ్లాట్‌ కొనుగోలుదార్లకు కూడా బదిలీ చేయాలి. కానీ కంపెనీ అలా చేయలేదని పూర్తిస్థాయి విచారణలో బయటపడింది. తద్వారా 400మందికిపైగా ఉన్న ఫ్లాట్‌ కొనుగోలుదార్లకు నష్టంచేకూరిందని తేలింది. దీంతో హౌసింగ్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టిన ‘అదానీ రియాల్టీ-ఎం2కే’పై కోటీ 25లక్షల రూపాయల పెనాల్టీ వేస్తూ ‘ఎన్‌ఏఏ’ ఆదేశాలు ఇచ్చింది.

హౌసింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో అదానీ రియాల్టీ, ఎం2కే సంయుక్తంగా తలపెట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ‘ఓయేస్టర్‌ గ్రాండే’. 2012లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ విలువ వెయ్యికోట్ల రూపాయలు. ఈ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌లో 400మందికిపైగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగా డిసెంబరు, 2018నాటికి కంపెనీ పెద్దమొత్తంలో పన్ను మినహాయింపులు పొందిందనీ, దీనిని వినియోగదారులకు బదిలీ చేయలేదనీ కొనుగోలు దారుల్లో ఒకరైన అమిత్‌ టాండన్‌ ఫిర్యాదుచేశారు. హర్యానా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్క్రీనింగ్‌ కమిటీ ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపి, రూ.కోటీ 25లక్షలు ‘అదానీ రియాల్టీ, ఎం2కే’ అప్పనంగా నొక్కేశాయని తేల్చింది.

పెనాల్టీలు కట్టండి : ఎన్‌ఏఏ విచారణ
స్క్రీనింగ్‌ కమిటీ విచారణలో తేలిన అంశాలతో ఫిర్యాదు కాస్తా ‘నేషనల్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ'(ఎన్‌ఏఏ)కి చేరింది. ఎన్‌ఏఏ కేంద్ర రెవెన్యూ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరపాలని ఎన్‌ఏఏ చీఫ్‌ బి.ఎన్‌.శర్మ ఆదేశించారు. సాంకేతిక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. ఫ్లాట్‌ కొనుగోలుదారులకు పన్ను మినహాయింపు దక్కలేదని తేల్చింది. మూడునెలల్లోగా 400మందికిపైగా ఉన్న ఫ్లాట్‌ కొనుగోలుదార్లకు ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ను (డిసెంబరు, 2018 నుంచి వడ్డీతో కలుపుకొని) బదిలీ చేయాలని ఆదేశించింది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates