ప్రక్షాళనకు నోచని వైద్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for ప్రక్షాళనకు నోచని వైద్యం"నియామకాల్లేని ఏడాది

వైద్యఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్న సీఎం హామీ ఈ ఏడాదీ అమలుకు నోచుకోలేదు. 2017లో మొదలెట్టిన నియామకాల ప్రక్రియ 2019 ముగింపునకు వచ్చినా కోర్టులోనే నలుగుతున్నది. అత్యవసర సేవల కోసం కొంతమేర తాత్కాలిక సిబ్బందిని నియమించినా.. రోగుల అవసరాలను తీర్చడంలో ఇబ్బందులు తప్పలేదు. 2019 మార్చి దాకా వైద్య శాఖకు మంత్రి లేకపోవడం పనితీరుపైనా ప్రభావం చూపింది. 108లో సిబ్బందిని తగ్గించడంతో వాహనాలు బాధితుల వద్దకు చేరేలోపే ప్రాణాలు పోయిన ఘటనలెన్నో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులు కొన్ని రోజులపాటు సేవలను నిలిపివేశాయి. డెంగ్యూ తదితర సీజనల్‌ వ్యాధులు అధికమవ్వటంతో ఆస్పత్రుల్లో బెడ్లతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని సర్కారుపై సీరియస్‌ అయింది. మరమ్మతులకు వచ్చిన ‘104’ వాహనాలను అలాగే మూలన పెట్టడంతో వాహనాల సంఖ్య తగ్గి దూరప్రాంతాలకు వెళ్లలేని రోగులకు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ)లో పని చేస్తున్న 10 వేల మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్‌ కార్డుల కోసం చేస్తున్న వినతి ఈ ఏడాది కూడా ఆచరణకు నోచుకోలేదు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో పని చేస్తున్న నర్సులు, ఇతర కాంట్రాక్టు సిబ్బంది ఏడాది పొడుగుతా మొరపెట్టుకున్నా సర్కారు మాత్రం చలించలేదు.

నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏది?
నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు హామీ ఈ ఏడాదీ పట్టాలెక్కలేదు. దీంతో ఆ శాఖలో పని చేస్తున్న నర్సింగ్‌ సిబ్బందితో పాటు ప్రయివేటు నర్సులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వేదిక లేకుండా పోయింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో కనీసవేతనాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో శ్రమదోపిడికి గురవుతూనే ఉన్నారు

నలుదిక్కులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులేవి?
హైదరాబాద్‌లోని బోధనాస్పత్రులకు జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి రోగులు అధికంగా వస్తుండటంతో ప్రత్యామ్నాయ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరానికి నలు దిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఒక్కోటి 500 బెడ్లతో నిర్మించాలని స్థలాలను పరిశీలించారు. ఆస్పత్రులనైతే కట్టలేదు.

సుడిగాలి పర్యటనలకే పరిమితం
వైద్యఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి ఈటల రాజేందర్‌ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. డాక్టర్లతో, వైద్యాధికారులతో సమావేశమై చర్చోపచర్చలు చేశారు. కానీ, ఫలితం శూన్యం.

కేసీఆర్‌ కిట్‌తో పెరిగిన ఆస్పత్రి ప్రసవాలు
కేసీఆర్‌ కిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చింది. కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే గుర్తించింది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates