ఆధిక్యంలో కాంగ్రెస్‌ కూటమి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాంచీ: ఝార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి, భాజపా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఆధిక్యంలో కాంగ్రెస్‌ కూటమి మెజార్టీ మార్క్‌ను దాటింది. ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ జంషెడ్‌పూర్‌ తూర్పులో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరేన్‌ కూడా పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో చిన్న పార్టీలైన ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్(ఏజేఎస్‌యూ)‌, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(జేవీఎం) పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో భాజపా ఆ పార్టీల నేతల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భాజపా అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా పార్టీలు ఆధిక్యంలో ఉన్న స్థానాలు ఇలా ఉన్నాయి..

భాజపా 28
కాంగ్రెస్‌+జేఎంఎం+ఆర్జేడీ 43
జేవీఎం(పీ) 4
ఏజేఎస్‌యూ 3
ఇతరులు 4

 

RELATED ARTICLES

Latest Updates