గోరటి వెంకన్నకు కబీర్‌ సమ్మాన్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for గోరటి వెంకన్నకు కబీర్‌ సమ్మాన్‌"

  • త్వరలో రూ.3 లక్షలు ప్రదానం

న్యూఢిల్లీ, డిసెంబరు : తన రచనలు, గానంతో ప్రజలను ఉర్రూతలూగించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మకమైన కబీర్‌ సమ్మాన్‌ పురస్కారం లభించింది. ఏటా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కళాకారులకు, సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి కోవింద్‌ త్వరలో భోపాల్‌లో ప్రదానం చేస్తారు. పురస్కారంలో భాగంగా రూ.3 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. వెంకన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1963లో జన్మించారు. పల్లె ప్రజలు, ప్రకృతిపై ఆయన ఎన్నో అద్భుతమైన పాటలను రచించి పాడారు. ఏకనాదం మోత, రేల పూతలు, అల చంద్రవంక, పూసిన పున్నం రచనలు చేశారు. పలు సినిమాలకు ఆయన పాటలు రాశారు. సాహిత్యరంగానికి ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లో కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును అందించింది. అనేక సంస్థల నుంచి ఆయన పురస్కారాలు అందుకున్నారు.

(Courtesy Andhrajyothi)

 

RELATED ARTICLES

Latest Updates