విద్యార్థినీలను వదలని…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ తరుణంలో ఒక్క సారిగా ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలోకి అడుగెట్టి.. విద్యార్థులపై లాఠీలను ఝులిపించారు. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా చితకబాదారు.

యూనివర్సిటీలోకి ప్రవేశించిన పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికల్లేకుండా.. విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో బార్సుహాస్టల్‌లోకి చొరబడి, షాహీన్‌ అనే విద్యార్థి చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతరం ఇష్టానుసారంగా లాఠీతో చితకబదారు. ఈ దారుణాన్ని గమనించిన నలుగురు తోటి విద్యార్థినీలు వచ్చి, అతనికి రక్షణ కవచంలా నిల్చున్నారు. గోబ్యాక్‌, గోబ్యాక్‌ అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా ఆ విద్యార్థిని విడిచిపెట్టకుండా విచక్షణారహితంగా లాఠీలతో దాడిచేశారు. అందులో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి మహిళలపై కూడా దాడికి యత్నించాడు. ఈ దాడిలో షాహీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అనంతరం షాహీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు హాస్టల్స్‌లోకి వచ్చి, విచక్షత రహితంగా దాడికి పాల్పడ్డారనీ. దాడి సమయంలో తన స్నేహితురాళ్లు చాలా ధైర్యంగా పోలీసులకు అడ్డు వచ్చి, తనకు రక్షణ కవచంలా నిల్చొని.. రక్షించడానికి ప్రయత్నించారని తెలిపారు. ప్రస్తుతం ఈదాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Courtesy Nava telangana 

RELATED ARTICLES

Latest Updates