మోడీ పాలనలో ఫాసిజం లక్షణాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రచన: బి. భాస్కర్

తృణమూల్ కాంగ్రెస్ తరపున తొలిసారి లోక్ సభకు ఎన్నికైన సభ్యురాలు మహువా మోయిత్ర పైన సంఘ్పరివార్ ఇప్పుడు గుర్రుగా ఉంది. పార్లమెంటులో తన తొలి స్పీచ్ లోనే మహువా మోడీపాలనలో ఏడు ఫాసిస్టు లక్షణాలు పొడసూపుతున్నాయి అంటూ అద్భుతమైన ప్రసంగం చేయటం వారికంటగ్గింపుకు కారణమైంది. మొవ్వ ప్రసంగాన్ని  ప్రధాన స్రవంతి మీడియా అంతగా పట్టించుకోకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. దీంతో ఆమెపై బురదజల్లేందుకు సంఘ్ పరివార్ సాకులు వెతికింది. చివరికి మహువా ఉపన్యాసం ఒక అమెరికన్ పత్రికలోని వ్యాసానికి కాపీ అని అబద్ధపు ప్రచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది. ఇంతకీ మహువా తన ప్రసంగంలో ఏం చెప్పిందో గమనిస్తే గాని బిజెపికి ఆమెపై అంత ఆగ్రహానికి అర్థం తెలియదు.

” ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం “, అంటూనే మహువా మోడీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన తీరుతెన్నుల్ని మొన్న జరిగిన ఎన్నికలతంతుని ఆమె ఎంతో శక్తివంతంగా దుయ్యబట్టారు.” ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అయితే నేడు ప్రజలకు నిరసన తెలిపే హక్కు అత్యంత అవసరం. అధికార పార్టీ సభ్యుల సంఖ్య పెరిగింది. ప్రతిపక్ష పార్టీ సభ్యుల సంఖ్య తగ్గింది. దీంతో లోక్సభలో సహజంగా ఉండాల్సిన సమతూకం దెబ్బతింటుంది. దేశంలో నేడు ఫాసిజం తాలూకు సంకేతాలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. బిజెపి చెప్పే హైపర్ జాతీయవాదం మన దేశపు భిన్నత్వాన్ని చిన్నాభిన్నం చేయనున్నది. ఇది’ ఇతరుల’ పట్ల అంటే ముస్లింల పట్ల ద్వేషభావాన్ని పెంచేదిగా ఉన్నది. భారత రాజ్యాంగ  విలువలను దెబ్బ కొట్టే ఆలోచనా విధానం ఇది. ఎం ఆర్ సి, సిటిజన్ షిప్ బిల్లులు ముస్లింలను దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం వినియోగించుకుంటున్నది.50 ఏళ్లుగా దేశంలో నివసిస్తున్న వారు సైతం నేడు తాము ఈ దేశపు పౌరు లమేనని సాక్ష్యపు కాగితాలు చూపించాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఈ ప్రభుత్వానికి మానవ హక్కుల అంటే లెక్క లేకుండా పోయింది.2014- 2019 మధ్యకాలంలో విద్వేష దాడులు 10 రెట్లు పెరిగాయి. పెహ్ళూ ఖాన్ నుంచి అన్సారి వరకు ఈ జాబితా నానాటికి పెరిగి పోతూనే ఉన్నది. అలాగే ప్రసార మాధ్యమాల పైన ఎన్నడూ లేనంత నియంత్రణ నేడు అమలవుతున్నది. దేశంలోనే ఐదవ పెద్ద మీడియా సంస్థలు ప్రత్యక్షంగాను పరోక్షంగానో ఒక్క వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి. టెలివిజన్ వార్తా ఛానళ్లు అధికార పార్టీ బాకాలుగా మారిపోయాయి. ఒక్కో టీవీ ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పండి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ  మీడియాలో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని మానిటరింగ్ చేయడం కోసం 120 మంది సిబ్బందితో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రైతుల కడగండ్లు నిరుద్యోగం వంటి ప్రజల నిజసమస్యలపై కాకుండా వాట్సప్ ద్వారా అబద్ధాల ప్రచారాన్ని దేశమంతా వ్యాపింపజేసి ఎన్నికలు జరిపించారు. అసత్యాన్ని మాటిమాటికి ప్రచారం చేసి నిజంలా నమ్మించే గోబెల్స్ తరహా వ్యూహాన్ని అధికార పార్టీ విజయవంతంగా అమలు చేసింది.

జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడిందని చెప్పి కనిపించని శత్రువును బూచిగా చూపించడం జరిగింది. ప్రజల మధ్య భయా వాతావరణాన్ని ఈ విధంగా బిజెపి సృష్టించింది. ఈ నేపథ్యంలో సైన్యం విజయాల్ని ఒక మనిషి తన విజయాలుగా ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి టెర్రరిస్టు దాడులు పెరిగాయి. కశ్మీర్ లో మన జవాన్లు మృతుల సంఖ్య 106 శాతం పెరిగింది. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం, మతం ఇంతగా పెన వేసుకోవటం ఏనాడు జరకలేదు.2.77 ఎకరాల రామజన్మభూమి పై అతి శ్రద్ధ చూపుతున్న అధికార పార్టీ ఎంపీలకు 80 కోట్ల ఎకరాల మిగతా సువిశాల భారతదేశం పట్ల నిష్ట కనిపించటం లేదు. ఫాసిజం తొలి సంకేతాల్లో ప్రధానమైనవి మేధావులు కళాకారుల పట్ల పాలకుల పూర్తి విముఖత. నిరసనకారులపై నేడు తీవ్ర అణచివేత కొనసాగుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 శాస్త్రీయఆలోచనలని పెంపొందించాలని పేర్కొంటున్నది. అందుకుభిన్నంగా దేశాన్ని చీకటి యుగాలకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల వ్యవస్థ ను ఇప్పటి ప్రభుత్వం తీవ్రంగా నీరు గార్చి వేసింది. ఎన్నికల్లో 60 వేల కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్క పార్టీ ఏ 27 వేల కోట్ల రూపాయల్ని వచ్చించి oదని పై అధ్యయనం చెప్పింది. దీనిపైన మాత్రం ఎన్నికల కమిషన్ నోరు మెదపడం లేదు. అమెరికాలోని హోలోకాస్ట్ మెమోరియల్( నాజీ నియంత హిట్లర్ దురాగతాలపై న) లోని ఒక పోస్టర్ ఫాసిజం తొలి సంకేతాలు , హెచ్చరికల్ని మనకు తెలియచెప్తుంది. హెచ్చరిక అంశాలనే నేను నా ఉపన్యాసంలో ప్రస్తావించాను,” అన్నారు మహువా.

ఆమె ఉపన్యాసానికి నిజానికి దేశంలోని స్రవంతి మీడియా అంతగా ప్రాధాన్యం ఇచ్చి ప్రాచుర్యం కల్పించలేదు కానీ. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఉపన్యాసం వైరల్ అయ్యింది దీంతో. మూగ పై దాడికి బిజెపి అనుకూల మేధావులు, మీడియా రంగంలోకి దిగాయి. వాషింగ్టన్ మంత్లీలో 2017లో ఒక రచయిత రాసిన వ్యాసాన్ని మహువా  తన ఉపన్యాసములో కాపీ కొట్టారని సంఘ పరివార్ అనుకూల మేధావులు రచయితలు దుష్ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ అబద్ధాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఎంపీ మహువా  ప్లే గరిజానికి పాల్పడ్డారనే ది వీరిఆరోపణ. చౌర్యం అంటే ఇతర గ్రంథాలు వ్యాసాలు పత్రాల నుంచి సమాచారాన్ని తీసుకుని దానికి తమ పేరు పెట్టుకోవడం. మహువా తమ సోర్ స్ ఏమిటో తన ఉపన్యాసంలో నేనే స్వయంగా ఉటంకించారు.  అలాంటప్పు డు అది చౌర్యం కిందికి రాదు. నిజానికి తాజాగా వాషింగ్టన్ మంత్రికి వ్యాసం రాసిన రచయిత తను కూడా హోలో కాస్ట్ మ్యూజియం పోస్టర్నుంచే తమ వ్యాసంలోని అంశాలను తీసుకున్నానని ట్వీట్ చేశారు. దీంతో సంఘ్ పరివార్ దాని వాట్సప్ప్ యూనివర్సిటీ కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మహిళా ఎంపీ అయిన మహువా మోయిత్ర తొలి ఉపన్యాసమే మోడీ ప్రభుత్వ ఫాసిస్టు పోకడల్ని చీల్చి చెండాడడం నిజంగా సంతోషకరమైన విషయం. అయితే పశ్చిమ బెంగాల్ తృణమూల్ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రంలో మోడీ తరహా నిరంకుశ ధోరణి ని అమలు చేస్తుండటం గర్హనీయం. మోడీ పాలనను ధను మాడిన మువా తమ నాయకురాలు మమతా బెనర్జీ కి కూడా జ్ఞానోదయం కలిగిస్తే బాగుంటుంది మరి.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు)

RELATED ARTICLES

Latest Updates