నెల్లూరుకు ఉరి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మూడు నెలలుగా యురేనియం కోసం తవ్వకాలు
– స్థానిక అధికారులకూ తెలియదు
– సీపీఐ(ఎం) చొరవతో వెలుగులోకి
– పనులు నిలిపివేత

నెల్లూరు : ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కు కుని సతమతమవుతున్న నెల్లూరు జిల్లా ప్రజానీకం పై కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రంగా పంజా విసి రింది. ఈ జిల్లాలోని అనంతసాగరం మండలం పడ మట కంభంపాడులో యురేనియం కోసం తవ్వకా లను మూడు నెలల నుండి కొనసాగి స్తోంది. పైగా ఇదేదో బోర్లు వేయడానికి చేస్తున్న పనులుగా స్థాని కులను నమ్మించే ప్రయత్నంచేసింది. నల్లమలలో, కర్నూలులో యురేనియంతవ్వకాలకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పటికీ కేంద్ర సర్కారు వైఖరిలో ఏమాత్రం మార్పు లేదనడానికి ఇక్కడ కొనసాగించ డమే నిదర్శనం. చాపకింద నీరులా సాగుతున్న యురేనియం తవ్వకాల వ్యవహారం స్థానిక సీపీఐ(ఎం) నేతల చొరవతోబుధవారం వెలుగు లోకి వచ్చింది. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కదిలారు. ‘యురే నియంతో ఉరేస్తారా..’ అంటూ తవ్వకాలను అడ్డుకు న్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అధికారయంత్రాంగం ఉలికి పడింది. హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి తవ్వకాలను నిలిపివేయిం చింది. యురేనియం కోసం జరుపుతున్న తవ్వకా లపై తమకు ఎటువంటి సమాచారం లేదని స్థానిక తహసిల్ధార్‌ శివరామకృష్ణ చెప్పారు.

80 అడుగుల లోతుకు డ్రిలింగ్‌
పడమటి కంభంపాడు గ్రామ సమీపంలోని రెవిన్యూభూముల్లో మూడు నెలల క్రితం తవ్వకాలు ప్రారంభమైనాయి. ప్రొక్లైనర్లను, భారీ ఎత్తున పైపులను అక్కడకు తీసుకురావడంతో కొంత చర్చ జరిగినప్పటికీ బోర్ల కోసం జరగుతున్న తవ్వకాలుగా స్థానికులు భావించారు. తవ్వకాలు చేస్తున్న వారు కూడా అదే నమ్మించే ప్రయత్నం చేశారు.

అనుమానాలు ఇలా…
అయితే, రోజుల తరబడి తవ్వకాలు కొనసాగ తుండటం, 80 అడుగుల లోతుకు పైగా డ్రిల్లింగ్‌ చేయడం, నున్నటి రాయిని తీసి ఎక్కడికో తరలిస్తుం డటంతో స్థానికులకు అనమానం వచ్చింది. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే కర్నూలులో తవ్వకాలను అక్కడి ప్రజానీకం అడ్డుకున్నారు. ఆ సంఘటన తరువాత స్థానికంగా తవ్వకాలు మరింత వేగవంతమయ్యాయి. ఒక చోట కాకుండా చుట్టుపక్కల అనేకచోట్ల తవ్వకాలు జరుపుతుండ టం, ఆరా తీసిన వారికి రాయిని ఢిల్లీకి పంపుతున్నా మని చెప్పడం వంటివి మరింత చర్చనీయాంశమైనా యి.ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పుల్ల య్య నేతృత్వంలో ఒక బృందం తవ్వకాలు జరుగు తున్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించింది. ఈ పరి శీలనలో యురేనియం కోసం జరుపుతున్న తవ్వకాలుగా నిర్ధారణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వా నికి చెందిన ఆటమిక్‌ మినరల్‌ డైరక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోజర్‌ అండ్‌ రీసెర్చి సంస్థ యురేనియం అన్వే షణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్నట్టు తేలిం ది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని బృందం ఈ విషయా న్ని వెంటనే స్థానిక తహిసిల్థార్‌ దృష్టికి తీసుకువెళ్లి తవ్వకాలు నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన తమకు కూడా సమాచారం లేదంటూ ఆర్‌ఐను సంఘటనా స్థలానికి పంపించి పనులు నిలిపివేయించారు. తవ్వకాల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.

శాశ్వతంగా ఆపాలి : సీపీఐ(ఎం), సీపీిఐ
అనంతసాగరం మండలంలో యురేనియం కోసం జరుగుతున్న తవ్వకాలను శాశ్వతంగా నిలుపుదల చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శిలు చండ్ర రాజగోపాల్‌, సిహెచ్‌ ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కారణంగా కాలుష్యం పెరిగి పోయిందన్నారు. ఇప్పుడు యురేనియం తవ్వకాలు జరిగితే ఆ ప్రాంతంలో నీరు, గాలి, సర్వం కాలుష్యమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో వామపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతాయని హెచ్చరించారు. ఈ తవ్వకాలపై స్పందించడానికి వైసీపీి, టీడీపీ నేతలు అందుబాటులోకి రాలేదు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో వైసీపీ నేతలు, చంద్రబాబు జిల్లాకు రానుండటంతో టీడీపీి నాయకులు బిజిగా ఉన్నారు.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates