ఇన్ఫోసిస్‌లో 12,000 ఉద్యోగాల కోత..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మిడ్‌లెవెల్‌లో 2 నుంచి 5 శాతం మంది
మేనేజర్‌ స్థాయిలో 2,200 మందిపై వేటు

ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. ప్రముఖ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను సాగనంపే ఆలోచనలో ఉన్నాయి. కాగ్నిజెంట్‌ సంస్థ 7,000 మందిని తొలగించేందుకు సిద్ధం కాగా.. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా పేరున్న ఇన్ఫోసిస్‌ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రానున్న మరికొన్ని త్రైమాసికాల్లో సంస్థలోని మిడ్‌, సీనియర్‌ లెవెల్‌ ఉద్యోగుల్లోంచి 12,000 మంది దాకా ఉద్యోగులను తప్పించే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. వేతన వ్యయాలు తగ్గించుకోవడంతోపాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగానే ఈ రెండు ఐటీ కంపెనీల యాజమాన్యాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఏ స్థాయిలో ఎంత మంది..?…..సంస్థలో భారీగా జీతాలు అందుకుంటున్న సీనియర్‌ మేనేజర్‌ (జేఎల్‌ (జాబ్‌ లెవెల్‌) 6) స్థాయిలో 10 శాతం మందిని బయటికి సాగనంపాలని ఇన్ఫోసిస్‌ భావిస్తోందట. అంటే, వారిలో గరిష్ఠంగా 2,200 మందిపై వేటు పడనుంది. అలాగే, అసోసియేట్‌ (జేఎల్‌ 3, అంతకంటే తక్కువ), మిడ్‌ (జేఎల్‌ 4-5) లెవెల్‌ ఉద్యోగుల్లోంచి 2 నుంచి 5 శాతం మందిని తప్పించే అవకాశం ఉంది. అంటే, ఈ విభాగంలో 4,000-10,000 మంది పింక్‌స్లి్‌పలు అందుకోవచ్చు. అలాగే, 2-5 శాతం మేర (50 మంది వరకు) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపైనా వేటు పడనున్నట్లు సమాచారం. కాగా, అత్యున్నత పనితీరుకు ప్రాధాన్యమిచ్చే కంపెనీల్లో.. అంచనాల మేరకు పనిచేయలేకపోతున్న ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని, దీ న్ని భారీగా ఉద్యోగాల కోతగా భావించవద్దని ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

2020లో వేతనాలు 10% పెరుగుతాయి…ముంబై, నవంబరు 5: భారత్‌లో వచ్చే ఏడాది జీతాలు 10 శాతం పెరుగుతాయని మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ విల్స్‌ టవర్‌ వాట్సన్‌ అంచనా వేసింది. సంస్థలు ఆచితూచి అడుగు వేస్తుండడంతో 2020లో నియామకాలు మందగిస్తాయని తెలిపింది. ‘‘2019లో జీతాలు 9.9 శాతం పెరిగాయి. భారత్‌లో జీతాల పెరుగుదల 10 శాతంగా స్థిరపడింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అధికమని వెల్లడించింది. ఇది ఇండోనేషియాలో 8%, చైనాలో 6.5, ఫిలిప్పైన్స్‌లో 6, హాంకాంగ్‌లో 4 శాతమేనని వివరించింది.

వివిధ స్థాయిల్లో ఇన్ఫోసిన్ ఉద్యోగులు:
జేఎల్ 3, అంతకు తక్కువ: 86,558
జేఎల్ 4-5 :1.1 లక్షలు
జేఎల్ 6-8: 30,092
సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు : 971

Courtesy Andhrajyothy…

RELATED ARTICLES

Latest Updates