టీఆర్టీ తప్పెవరిది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ఒక్క నోటిఫికేషన్‌.. రెండేళ్ల సమయం.. ఇప్పటికీ చేతికందని అపాయింట్‌మెంట్‌ లెటర్లు.. ఉద్యోగం వస్తుందో, రాదో తెలియక కొందరు.. వచ్చిన ఉద్యోగానికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారో, లేదోనని మరికొందరి ఆందోళన. ఇదీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్టీ) పరిస్థితి! విద్యార్థులకు చదువు చెప్పాల్సిన భావి ఉపాధ్యాయులు.. పోస్టింగుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా ఆందోళన చేస్తున్నా ఇటు ప్రభుత్వానికి, అటు టీఎ్‌సపీఎస్సీకి పట్టడంలేదు. టీఆర్టీ నియామకాల ఆలస్యానికి కారణమెవరు? ఈ తప్పెవరిది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఏళ్లపాటు కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెండేళ్లు… ఎన్నో ఉద్యమాలు..రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి 2017 అక్టోబరు 21న టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది ఫలితాలు ప్రకటించి.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసింది. రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు 2300 మంది అభ్యర్థులకే పోస్టింగులు ఇచ్చింది. అంటే ఇంకా 6500 పోస్టులకు నియామకాలు చేపట్టాల్సి ఉంది. కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఎస్జీటీ, పీఈటీ, ఎస్‌ఏ(పీహెచ్‌సీ), ఎస్‌ఏ(హిందీ పండిట్‌) పోస్టులకు సంబంధించి ఫలితాలు కూడా ఇవ్వలేదు. ఫలితాల కోసం అభ్యర్థులు ఆందోళనలూ నిర్వహించారు. తాజాగా శుక్రవారం కూడా ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. అయినా సర్కారు, టీఎ్‌సపీఎస్సీల్లో చలనం లేదు.

కోర్టు గడువు ముగిసినా…2018 డిసెంబరు 31, 2019 ఏప్రిల్‌ 4న ఇంగ్లిషు, తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులకు సంబంధించి టీఎ్‌సపీఎస్సీ 1:1 జాబితాను ప్రకటించింది. అయితే కొందరు రెండు ఉద్యోగాలు పొందారని, వారిని ఒకే ఉద్యోగం ఎంచుకునేలా రీలింగ్వి్‌షమెంట్‌ ప్రక్రియను చేపట్టాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలా చేయడం ద్వారా తక్కువ మార్కులతో జాబితాలో చోటు దక్కనివారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు సెప్టెంబరు 30వ తేదీ వరకు రీ లింగ్వి్‌షమెంట్‌ ప్రక్రియను పూర్తి చేసి ఫలితా లు ఇవ్వాలని టీఎ్‌సపీఎస్సీని ఆదేశించింది. ఆ గ డువు కూడా దాటిపోయింది. అయినా ఎస్జీటీ ఫ లితాలను విడుదల చేయకపోవడం గమనార్హం.

ఒక్క నోటిఫికేషన్‌.. రెండేళ్ల సమయం.. ఇప్పటికీ చేతికందని అపాయింట్‌మెంట్‌ లెటర్లు.. ఉద్యోగం వస్తుందో, రాదో తెలియక కొందరు.. వచ్చిన ఉద్యోగానికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారో, లేదోనని మరికొందరి ఆందోళన. ఇదీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్టీ) పరిస్థితి! విద్యార్థులకు చదువు చెప్పాల్సిన భావి ఉపాధ్యాయులు.. పోస్టింగుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా ఆందోళన చేస్తున్నా ఇటు ప్రభుత్వానికి, అటు టీఎ్‌సపీఎస్సీకి పట్టడంలేదు. టీఆర్టీ నియామకాల ఆలస్యానికి కారణమెవరు? ఈ తప్పెవరిది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఏళ్లపాటు కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెండేళ్లు… ఎన్నో ఉద్యమాలు…రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి 2017 అక్టోబరు 21న టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది ఫలితాలు ప్రకటించి.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసింది. రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు 2300 మంది అభ్యర్థులకే పోస్టింగులు ఇచ్చింది. అంటే ఇంకా 6500 పోస్టులకు నియామకాలు చేపట్టాల్సి ఉంది. కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఎస్జీటీ, పీఈటీ, ఎస్‌ఏ(పీహెచ్‌సీ), ఎస్‌ఏ(హిందీ పండిట్‌) పోస్టులకు సంబంధించి ఫలితాలు కూడా ఇవ్వలేదు. ఫలితాల కోసం అభ్యర్థులు ఆందోళనలూ నిర్వహించారు. తాజాగా శుక్రవారం కూడా ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. అయినా సర్కారు, టీఎ్‌సపీఎస్సీల్లో చలనం లేదు.

కోర్టు గడువు ముగిసినా..2018 డిసెంబరు 31, 2019 ఏప్రిల్‌ 4న ఇంగ్లిషు, తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులకు సంబంధించి టీఎ్‌సపీఎస్సీ 1:1 జాబితాను ప్రకటించింది. అయితే కొందరు రెండు ఉద్యోగాలు పొందారని, వారిని ఒకే ఉద్యోగం ఎంచుకునేలా రీలింగ్వి్‌షమెంట్‌ ప్రక్రియను చేపట్టాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలా చేయడం ద్వారా తక్కువ మార్కులతో జాబితాలో చోటు దక్కనివారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు సెప్టెంబరు 30వ తేదీ వరకు రీ లింగ్వి్‌షమెంట్‌ ప్రక్రియను పూర్తి చేసి ఫలితా లు ఇవ్వాలని టీఎ్‌సపీఎస్సీని ఆదేశించింది. ఆ గ డువు కూడా దాటిపోయింది. అయినా ఎస్జీటీ ఫ లితాలను విడుదల చేయకపోవడం గమనార్హం.

 Courtesy Andhrajyothi..

RELATED ARTICLES

Latest Updates