పౌరహక్కుల సంఘం మరియు TVV విద్యార్థినాయకులను బేషరతుగా విడుదలచేయాలి..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసారు. వాటిల్లో ఏఒక్కటిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.

రాష్ట్రంలోని 49 వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మిస్తామని కోటి ఎకరాలకు నీటిని అందిస్తామని వాగ్దానం చేశారు. గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మించక పోగా బారీ ఖర్చుతో కూడిన భారీ  ప్రాజెక్టులకు పూనుకున్నారు. అందులో భాగమే మల్లన్న సాగర్  రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు  దానివలన అనేకమంది రైతులు, కూలీలు. పేద ప్రజలు నిర్వాసితులవుతున్నారు – నిర్వాసితులు అవుతున్న రైతులు. కూలీలు.

Civil right Leaders Altercation at Thoguta Police Station

పేద ప్రజలు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా వారిని కలిసి వారిపోరాటానికి సంఘీభావం తెలిపివస్తున్న పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డంలక్ష్మన్, ప్రధాన కార్యదర్శినారాయణరావు, సంయుక్త కార్యదర్శిరఘునాథ్ మెదక్ జిల్లా అధ్యక్షుడుభూపతి లక్ష్మీనారాయణ మరియు శ్రీనివాస్తోతో సహా 10మందిని తోగుట్టస్టేషన్ వద్ద అక్రమంగా పోలిసులు నిర్బంధించడాన్ని అలాగే ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావులను దేశవ్యాప్తంగా అరెస్టు చేసినహక్కుల కార్యకర్తలను ఆదివాసీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని, బీమా కోరేగావ్ కేసును రద్దు చేయాలని క్రూరమైన నిర్బంధపూరిత “ఉపా” చట్టాన్ని వెంటనే ఎత్తిచేయాలని వరంగల్ లో రాజ్యనిర్బంధ వ్యతిరేక యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్నTVV నాయకులను, పౌరహక్కుల సంఘం నేతలను అరెస్ట్ చెయ్యటాన్ని ఖండిస్తూ బేషరతుగా విడుదలచేయాలని, సిద్ధిపేట మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులౌతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రేట్లు నష్ట పరిహారం ఇవ్వాలి. ముందస్తుగానే పునరావాసాన్ని కల్పించాలి. భూములు కోల్పోయిన వారి కుటుంబలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని… UCCRI(ML) కిషన్ వర్గం రాష్ట్ర నాయకులు – G.సదానందం. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (DSO) రాష్ట్ర నాయకులు అర్షం అశోక్, M.అనీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

G. Sadanandam 

RELATED ARTICLES

Latest Updates