-
- అవినీతిలో సర్కారు గొప్ప
- భావి తెలంగాణకు పెను భారం
- మూడేళ్లలోనే రెట్టింపైన రుణాలు
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
కుమార్ రెడ్డి ఆరోపించారు. పారదర్శకత, పద్ధతీ లేకుండా రాత్రికి రాత్రి వేల కోట్ల అంచనాలు పెంచేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి తెలంగాణకు రూ.69 వేల కోట్ల అప్పు ఉండగా, మూడేళ్లు కూడా పూర్తికాని టీఆర్ఎస్ సర్కార్ హయాంలో అది రెట్టింపు అయిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై అప్పు 1.28 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో, అంతకుముందు తన ప్రసంగంలో ఉత్తమ్ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘‘తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ప్రతి ఎకరాకూ సాగునీరు అందాలి. ఇందుకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుంది. అయితే, రీడిజైన్ పేరిట జరిగే దోపిడీని మాత్రం సహించం’’ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, భక్త రామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలంటూ కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, ఆ టెండర్లలో అక్రమాలకు అవకాశమిచ్చారన్నారు. కాళేశ్వరం అంచనాలను కేవలం మూడు నెలల్లో రూ.33 వేల కోట్ల నుంచి 83వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. దేశంలో ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉండదన్నారు. ‘‘గతంలో ఉన్న ఆయకట్టే, గతంలో ఉన్న సామర్థ్యమే. కానీ… అంచనా వ్యయం మాత్రం పెరిగింది’’ అని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.35,200 కోట్ల నుంచి మూడు నెలల్లో 50,985 కోట్లకు పెంచారని చెప్పారు. ‘‘పని మొదలు పెట్టకుండానే ప్రాజెక్టు వ్యయం 50 శాతం పెరగడం ప్రపంచంలోనే మొదటిసారి కావొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో వ్యాట్, ఎన్ఏసీ, రివైజ్డ్ ఎస్‌ఎ్‌సఆర్‌ను మార్చిలో రూ.5372 కోట్లుగా చూపించి… ఆగస్టుకు రూ.9231 కోట్లు చేశారన్నారు. ఇదెలా మారిందని ప్రశ్నించారు. పాత కాంట్రాక్టర్లకే కొత్త లెక్కలతో పనులు అప్పగించారన్నారు. పాలమూరు-రంగారెడ్డిలో 7424 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మెరుగైన జీవితం కోసం సోనియా గాంధీ ఒక తల్లిలా రాషా్ట్రన్ని ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు. ‘‘ఉమ్మడి ఏపీ రెవెన్యూలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని… దానిని పంచాలని విభజన సమయంలో డిమాండ్ వచ్చినా ఆమె తలొగ్గలేదు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే దక్కేలా… ఒక ధనిక రాష్ట్రాన్ని ప్రజల చేతిలో పెట్టారు. కానీ, టీఆర్ఎస్ సర్కార్ అనతి కాలంలోనే రాషా్ట్రన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది’’ అని ఆగ్రహించారు.
రివర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇన్ని కడితే ఖర్చు పెరగదా!? కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు-రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టులతోపాటు తెలంగాణవ్యాప్తంగా రిజర్వాయర్లను నిర్మిస్తే ఖర్చు పెరగదా? ప్రాణహిత ప్రాజెక్టును రూ.38 వేల కోట్లు అంచనా వేస్తే, ఇప్పుడు 83 వేల కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకూ సమంజసమని అడుగుతున్నారు. మీరు (కాంగ్రెస్) ప్రాణహితద్వారా 16 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. తుమ్మిడిహట్టితో 5 టీఎంసీలు, మేడారం రిజర్వాయర్‌తో 0.5 టీఎంసీలు, మల్లన్నసాగర్‌తో 0.5 టీఎంసీలు.. ఇలా 16టీఎంసీలకు లెక్కగట్టారు. కానీ, ఇదే ప్రాజెక్టులో మేం 200 టీఎంసీ లను అందుబాటులోకి తెస్తున్నాం. అందుకే ఖర్చు పెరిగింది.
ప్రాణాలు పోయినా అవినీతి జరగనివ్వం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే రాజకీయ అవినీతిని పూర్తిగా పారదోలాం. సచివాలయంలో ఇప్పుడు కాంట్రాక్టర్లు, పైరవీకారులు కనిపించడం లేదు. ప్రాణాలు పోయినా ప్రాజెక్టుల రీ డిజైనింగులో జల యజ్ఞం వంటి అవినీతిని జరగనివ్వం.
Courtesy Andhrajyothi