ప్రశ్న రోజు రోజుకు నేరస్థురాలవుతుంది. దొరగారి ఫాసీజం రోజు రోజుకు మన ఇంటితలుపు తట్టడం మరింత వేగవంతం చేస్తుంది. ఇక మిగిలింది తలుపు భల్లున విరిగిపోవడమే. ఎర్రగుండె ఐనా నల్లగొండ జిల్లా నుండి, మారుమూల వాడ నుండి, మాదిగ ఉపకులం నుండి అంబేడ్కర్ ఇచ్చిన చైతన్యంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగొచ్చినదామె.
ఆమె తెలంగాణం వనరుల దోపిడిని కాపాడుకుందామని వినిపించిన అతికొద్ది గొంతుకలలో ఆమె ఉంది. శాతవాహన యునివర్సటీలో సోషియాలజీ ప్రొఫేసర్ గా Sujatha Surepally సుజాత పనిచేస్తుంది.
పదముడేళ్ళ కిందట తెలంగాణ ఆకాంక్షను భుజానెత్తుకుంటు ఆవిర్భవించిన సంస్థ Telangana Vidyarthi Vedika – TVV. సమైఖ్య రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నొ చీకటిరోజులను ఎదురీదుతు వెలుగు కోసం ఆశగా ఎదురుచూస్తూ తెలంగాణను సాధించిన శక్తులలో ఒకటి. తెలంగాణ ప్రజలపై అహంకారంగా మాట్లాడితే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటివాడికి చెప్పుదెబ్బల రుచి చూపించిన మిలిటేన్సి దాని సొంతం. ఛలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సాగహారంలో చూపించిన తెగువ రాజ్యాన్ని బెంబెలెత్తించింది. రాజ్యాంగం హామిపడ్డ హక్కులను ప్రజాస్వామిక తెలంగాణ ఎజండాగ పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమంటే విప్లవం మాట్లాడటమే అనెంతగా పాలకులు వ్యవహరిస్తున్నారు.

నిన్న ఏబివిపి శాతవాహన యూనివర్సిటీలో సూరెపల్లి సుజాత, టివివి సంస్థ మావోయిస్టు పార్టికి అనుభందంగాను, సానుభూతిపరులుగాను చిత్రిస్తూ ఆందోళన చేశాయి. అమ్మాయిలను వేధిస్తున్న లెక్చరర్ పెంచల శ్రీనివాస్ ను కంటికిరెప్పల కాపాడుతున్న రిజిస్ట్రార్ గారికి భక్తిగా వినతిపత్రం కూడా అందించాయి. దేశ రాజధానిలోనున్న, అత్యంత ప్రతిష్టాత్మకమైనా జె.ఎన్.యూలో ఎవరికీ అంతుచిక్కకుండా నజీబును మయాం చేసిన సంస్థ. (నజీబ్ తల్లి రెండేళ్లుగా పీడకలలతో నిద్రలేని రాత్రులతో, బిడ్డ కోసం పోరాటం చేస్తు ఇచ్చిన ప్రకటన) నేడు ఆ సంస్థనే శాతవాహనలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుందంటే ఊహించండి. ఎంత హస్యస్పదయక విషయమొ. జెఎన్.యూ లాగే దేశ ద్రోహులున్నారంటు ఇప్పుడూ వాగుతున్నారు. నజీబ్ లాగే ఇక్కడ కూడా ఎవరైనా మాయం చేయబడితే..!
నమొ అంటూ బ్రహ్మణీయ ఫాసీజాన్ని తలకెత్తుకున్న సంస్థ గతంలోను శాతవాహనను వివాదస్పందంగా సమాజం ముందుంచింది. అనాగరికమైన మనువాదాన్ని అంబేద్కర్ దహనం చేసిన రోజునాడు శాతవాహనలోను అదే స్ఫూర్తితో తగలబెట్టి భారత రాజ్యాంగంను ఎత్తిపట్టారు. ఏబివిపి ఇతర హిందుత్వ(హిందూ మతాన్ని రాజకీయాలలోకి లాగి కల్లోలం సృష్టించే) సంస్థలు భారతమాతను దహనం చేసారని రేచికటితో అల్లకల్లోలం చేశారు. అసలు వాస్తవాలను వీడియొలు, లైవ్ వీడియోలలో తేలిపోగ వెనకడుగు వేసారనుకొండి. కానీ, అక్రమకేసులకు మాత్రం ప్రొఫెసర్, విద్యార్థులు బలయ్యారు.
టీవీవీ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫేసర్ సాయిబాబా, చర్చల మధ్యవర్తి, కవి–రచయిత వరవరరావు, ప్రొఫేసర్ షోమాసేన్, చిన్నతనంలోనే అమెరికా సిటీజన్ షిప్ తలదన్ని భారత పీడితుల కోసం, మహిళలకోసం పనిచేస్తూ హార్డ్వర్డ్ యూనివర్సిటీచే అవార్డు పొందిన అడ్వకేట్ సుధా భరద్వాజ్ తదితరుల విడుదల కోరుతూ ఏ చిన్న స్వరం వినిపించిన 56 ఇంచుల ఛాతి ప్రభుత్వానికి, 1988లోనే డిజిటల్ కెమెరాలో ఫుటోలు తీసిన రాడరేంద్ర మోదీకి ఇబ్బందికరమైనది వారి విడుదల విషయాన్ని మాట్లాడడం. వారికే కాదు డెబ్బై వేల పుస్తకాలు నెమరేసిన దొరగారికి, ఎమ్మెస్సి పొలిటికల్ సైన్స్ చదువరికి, మూడో ఫ్రంట్ దీక్ష పూనుకున్న కేసిఆర్ గారికి కూడా ప్రమాదం. వీరి ఎజండా అల్లా దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఉంపేక్షించకూడదనే.
ఇవ్వాల దొరగారి రాజ్యంలో ఇండ్లు జైళ్ళుగా మారాయి. ఉద్యమాలపై ఉక్కుపాదంతో అక్రమకేసులతో సంస్థలను బలహీనపరచాయి. ఒక సంక్షోభ కాలాన్ని సృష్టించాయి.
సూరెపల్లి సుజాతకు మావోయిజం పట్ల ఏకిభావం లేదు. ఈ మధ్య జరుగుతున్న చర్చలు కూడా ఒక ఉదాహరణ. మావోయిస్టులు ఏ ఎన్నికలను బహిష్కరించమని వినమ్రంగా కోరిందో, ఆ ఎన్నికలలలోనే పాల్గొన్న వ్యక్తి సూరెపల్లి సుజాత. మావోయిస్టులను విభేదిస్తూ అంబేద్కర్ ఆలోచనను ఎజండాగా ఎర్పడ్డ బియస్.పి పార్టి నుండి ఎమ్మెల్యెగా పోటి చేసిన వ్యక్తి సూరెపల్లి సుజాత. ఆమెకు మావోయిస్టు అనే స్టాంపు వేస్తున్నారు. కారణం ప్రశ్నించడమే. తన సోషియాలజీ ప్రాజెక్టులలో ఆదివాసీ, దళిత స్త్రీల జీవితాల్ని ప్రతిబిబించమే కారణం. సోషియాలజి అంటే ఏసీ గదుల్లో స్వేదం చిందని జీవితాల అధ్యాయనం కాదు. బుక్కెడు నీళ్ళ కోసం చెలిమెలు తవ్వి తవ్వి పొట్టపగిలిన ఆదివాసీ చిట్టితల్లుల వెతలను పాఠాలుగా మార్చడం చేసుకోవడం సోషియాలజిస్ట్ ప్రాథమిక లక్షణం. కానీ, ఆధిపత్య వ్యవస్థ, సంస్థలకు ఇది నప్పని విషయం. ప్రపంచ వ్యాప్తంగా పెరొందిన ఎకనామిస్ట్. ఇతర దేశస్తుడు. ఈ దేశంలో అందరికీ ఆహారం అందించాలనే డిమాండ్ తో పనిచేస్తున్న ప్రొ. జీన్ డ్రిజ్ అరెస్టు చేసి బంధిజిన వ్యవస్థలో ఇలాంటి దాడులు ఊహించనివేమికాదు. కానీ, ప్రజాస్వామిక విలువల హననం, హక్కుల హననం అవుతున్న సంక్షోభకాలంలో వాదాల పోట్లాట తగ్గించి ఉమ్మడి శత్రువుపై పోరాటాన్ని ఎజండాగా సాగుదాం. ఇలాంటి దాడులు దళితులపై, ఆదివాసీలపై, బుద్దిజీవులపై సాగడాన్ని నిరోదించగలం. ప్రొ.సాయిబాబలాంటివారిని ప్రాణాలతో కాపాడుకోగలం.
Aravind – Virasam