పత్రికా ప్రకటన
మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల, వ్యక్తుల ఐక్య కార్యాచరణ
మిర్యాలగుడా కు చెందిన ఎస్టి మహిళపై అత్యాచారం, అకృత్యాలు, అక్రమ రవాణా జరిగిన తీరు సమాజాన్ని దిగ్బ్రాంతి కి గురిచేసింది. సంస్థలు గానూ, వ్యక్తులు గానూ అసహాయురాలైన మహిళను లైంగిక దోపిడీకి గురి చేసిన తీరు తలదించుకునేలా వుంది.
-బాధిత మహిళ ఫిర్యాదు పై సమగ్రమయిన, నిష్పక్షపాతమయిన విచారణ జరిపి నిందితులు ఎవరయినా సరే వారికి శిక్ష పడేలా పటిష్టం గా కేసు తయారు చేయాలని పోలీసులను మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల వ్యక్తుల ఐక్య కార్యాచరణ గా డిమాండ్ చేస్తున్నాం.
-ఇప్పటికే బహిర్గతమయిన వ్యక్తులు తప్పుదారి పట్టించగలిగిన పలుకుబడి గలిగిన స్థాయిలో వున్నారు కాబట్టి ఎటువంటి జోక్యాన్ని అనుమతించని పారదర్శక విచారణ జరగాలి.
-బాధిత మహిళకు అవసరం అయిన వైద్య సదుపాయం, రవాణా, నివాసంతో పాటు భద్రత కల్పించాలి. ఆమె కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత వుంది.
-లైంగిక దాడి తో పాటు అక్రమ రవాణాకు గురయిన నేపథ్యంలో అక్రమ రవాణా బ్రోకర్లు, కీలక వ్యక్తుల సమాచారం సేకరించితే ఇంకా అనేకమంది బాధితుల్ని రక్షించే అవకాశం వుంటుంది.
-11 సంవత్సరాల పాటు జరిగిన ఈ అకృత్యం పై విచారణ జరపడానికి అవసరం అయిన సామగ్రి, సిబ్బంది, నిధులను ప్రభుత్వం వెంటనే అందించాలి.