ఒకే పని.. వేతనం వేరు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– ‘డెలివరీ సిబ్బంది’గా ఉన్న మహిళలపై వివక్ష
– స్విగ్గీ, అమెజాన్‌, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థల నిర్వాకం

సాంప్రదాయ వృత్తుల్లోనేగాక, కొత్తగా ఏర్పడుతున్న ఉపాధిరంగాల్లోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. గ్రామాలు మొదలుకుని పట్టణాల్లోనే కాదు ఈకామర్స్‌, కొరియర్‌ కంపెనీల్లో పనిచేసే స్త్రీలకు వేతనాల్లో అన్యాయం జరుగుతు న్నది. కాంట్రాక్ట్‌ ఉద్యోగాలుగా పనిచేస్తున్న వేలాదిమంది మహిళలు వేధింపులతో పాటు పలుసవాళ్లు ఎదుర్కొంటు న్నారు. కంపెనీ అప్పజెప్పిన ‘సరుకు డెలివరీ’ విధుల్ని చక్కగా నిర్వహిస్తున్నప్పటికీ, పురుషులకన్నా తక్కువ వేతనాలు అందుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌ మొద లైన కంపెనీల ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందజేయటం లో పురుషులకన్నా మహిళా సిబ్బంది ఒక అడుగు ముందే ఉన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లటం, భద్రతా పరంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ధైర్యంగా పనిచేస్తున్నారు. కానీ వేతనం దగ్గరకు వచ్చేసరికి ‘వివక్ష’ కొనసాగుతోంది. వివిధ కంపెనీలు సైతం ఈవాతావరణాన్ని అనుకూలంగా మలుచుకొంటు న్నాయి.

ఈకామర్స్‌, కొరియర్‌ రంగాల్లో ‘డెలివరీ బారు’తో పోల్చితే ‘డెలివరీ గర్ల్‌’కు 8 నుంచి 10శాతం తక్కువ వేతనాలు ఇస్తున్నారని ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ నివేదిక తెలిపింది. దేశంలోని ‘డెలివరీ ఇండిస్టీ'(వస్తు రవాణా)లో ప్రస్తుతం 68వేలమంది మహిళలు పనిచేస్తున్నారనీ, ఫుడ్‌ టెక్నాలజీ(స్విగ్గీ, జొమాటో..) సంస్థల్లో, ఈకామర్స్‌, కొరియర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో వీరంతా పనిచేస్తున్నారనీ నివేదిక తెలిపింది. రూ.15వేల నుంచి రూ.30వేల మధ్య వేతనాలు అందుతున్నాయట. ఈ నివేదికలో తెలిపిన మరికొన్ని సంగతులు ఇలా ఉన్నాయి.

పురుషులతో పోల్చినప్పుడు విధుల్లో మహిళలపై తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ మహిళలు, పురుషులు చేస్తున్న పని ఒకటే. కానీ వేతనాల్లో చాలా తేడా ఉందని నివేదిక పేర్కొ న్నది. తక్కువ వేతనాలతో పనిచేయించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది కాలంగా కంపెనీలన్నీ మహిళా నియామకాల్ని పెంచాయి.

అమెజాన్‌, పిజ్జాహట్‌, బాస్కెట్‌, హేడీడీ మొద లైన వాటిల్లో నియామకాలుపెరిగాయి. వీరంతా కూడా ద్వి చక్ర వాహనాలపై వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులు అందజేస్తున్నారు. టూవీలర్‌ నడపటం వచ్చితీరాలి. కొరియర్‌, ప్రొడక్ట్‌ డెలివరీ నిమిత్తం కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి నా వెనుకాడరాదు. ఇలాంటి సందర్భాల్లో మహిళల భద్రతకు ప్రమాదం పొంచివుందని నిపుణులు హెచ్చరించారు.

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates