స్పుత్నిక్‌ వి టీకాలు భారత్‌ వచ్చాయ్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌: కొవిడ్‌ నిరోధానికి రష్యాలో అభివృద్ధి చేసిన కొవిడ్‌ స్పుత్నిక్‌ వి టీకాలు భారత్‌కు వచ్చాయి. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కిన సంగతి విదితమే. త్వరలోనే పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్‌ రెడ్డీస్‌, స్పుత్నిక్‌ వి అన్న లోగోలున్న వాహనం నుంచి చిన్న పాటి కంటైనర్లను కిందకు దించుతూ ఒక వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

92% ప్రభావవంతం..ఆర్‌డీఐఎఫ్‌:  రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ కొవిడ్‌ నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపాయి. దాదాపు 40,000 మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఆర్‌డీఐఎఫ్‌, రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి సెప్టెంబరు 2020న ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌కు ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 11, 2020న రష్యాలో స్పుత్నిక్‌ వి ని రిజిస్టర్‌ చేశారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates