కేసులో YSRCP దళిత (మాల/మాదిగ )భక్తులు బాగానే పని చేస్తున్నారు . అక్కడ ఉన్న ఒక పని చేసే మాదిగ యువతిని ముందు పెట్టి కాపు , కమ్మలని కాపాడే ప్రయత్నం లో రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు .తెలంగాణలో TRS దళిత భక్తులు అంతే . సమస్యని బొంద పెట్టి దోపిడి కులాలని కాపాడడానికి మీ జాతి ని కూడా తాకట్టు పెడుతున్నందుకు నమస్సుమాంజలి ????
ఇపుడు దళితులు పార్టీలుగా , కులాలుగా , మతాలుగా , విభజించబడ్డారు, ఇక లింగ భేదం ఎట్లాగూ విడమర్చి చెప్పక్ఖర్లేదు . ఎర్రి తమ్ముళ్ళు , అన్నలూ .. మాలా , మాదిగలుగా కొట్లాడుకోవడం వాళ్ళ డిజైన్ . వాళ్ళకి హింసించడానికి మాలా , మాదిగా , డక్కలి , మాష్టి అందరూ సమానమే , అందులో స్త్రీలంటే లెక్ఖ లేనంత ప్రేమా అభిమానం . కులం , అంటరానితనంలేకుండా రేప్ లు , ప్రేమ లు , పెళ్ళిళ్ళు అన్నీ వాడుకోవడానికి అనుకూలం . అందులో ఇరుక్కొని మేధావులుగా చెలామణి అవుతున్న మీ అందరికి మా ( మాది కూడా ఒక జాతి , ఎక్కడ అన్యాయం జరిగినా పరుగుపెట్టే జాతి , ముందుగా అణగారిన వర్గాలకి ఎవరూ ఉండరు కాబట్టి అటుపోతాం ) నివాళి . రోజుకొక శిరోముండనం లో మాల ఎవరు , మాదిగ ఎవరు అనే లెక్ఖలు వేసుకోండి . మీ మీ కులాలకి ఎదో ఒక పదవి మొహాన పడేయక మానరు . కాని అంతిమంగా అంటరాని కులాలకి అన్యాయం చేస్తున్నారు అని తెలుసుకొనే సరికి ఎవరూ మిగలరేమో చూసుకోండి . మనిషిగా స్పందించడిరా బ్రదర్స్ , కులాలుగా తరువాత కొట్లాడుకుందురు కాని దళిత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన అంబెద్కర్ ఇప్పుడు లేకపోవడమే అద్రుష్టం అనుకోవాలి .