కార్మికుల పీఎఫ్‌ మాయం.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • 2014 నుంచి రూ.826 కోట్లు సొంతానికి…
  • కార్మికుల వేతనాల నుంచి నెల నెలా జమ
  • దానిని పీఎఫ్‌ ఖాతాకు జమ చేయని వైనం
  • వరుసగా రెండేళ్లు ఈపీఎ్‌ఫవో నోటీసులు
  • ఆర్టీసీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన పీఫ్‌ ఆఫీసు
  • రుణాలు పొందలేక కార్మికులు సతమతం
  • ఏకంగా 7000 దరఖాస్తులు పెండింగ్‌
హైదరాబాద్‌: ప్రావిడెంట్‌ ఫండ్‌.. ఉద్యోగి భద్రతకు భరోసా! ఇందుకు వేతనం నుంచి ఉద్యోగి 12ు చెల్లిస్తే.. అంతే మొత్తాన్ని యాజమాన్యం జమ చేస్తుంది! మొత్తం 24 శాతంలో 8.33 శాతం పింఛను ఖాతాకు వెళుతుంది! మిగిలిన 15.67ు పీఎఫ్‌ ఖాతాలో ఉంటుంది! కంపెనీ చిన్నదైనా.. పెద్దదైనా పీఎఫ్‌ మొత్తాన్ని ప్రతి నెలా జమ చేయాల్సిందే! చేయకపోవడం నేరం! కానీ, ప్రభుత్వ రంగ సంస్థ టీఎ్‌సఆర్టీసీయే ఏళ్లతరబడి ఈ నేరానికి పాల్పడుతోంది! తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.826 కోట్లను పీఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా వాడేసుకుంది! పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, వైద్య ఖర్చుల కోసం రుణాలు కావాలంటూ ఆర్టీసీ కార్మికులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మీ ఖాతాలో డబ్బుల్లేవంటూ పీఎఫ్‌ కార్యాలయం తిరస్కరిస్తోంది. వారికి రుణాలు మంజూరు కావడం లేదు. అందుకే, ‘మా సొమ్ములు మా ఖాతాలకు వెంటనే బదలాయించండి’ అని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మె ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి!

పీఎఫ్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులకు వేతనాలను సకాలంలో ఇవ్వని యాజమాన్యం.. వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులను కూడా మింగేసింది! ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, అధికారి నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎ్‌ఫను కట్‌ చేస్తుంది. దానికి యాజమాన్యం మరో 12 శాతం కలుపుతుంది. మొత్తం 24 శాతంలో 8.33 శాతం సొమ్ము పింఛను ఖాతాకు జమ చేస్తోంది. మిగతా 15.67 శాతానికి సంబంధించిన సొమ్మును పీఎఫ్‌ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ.. ఈ సొమ్ము ట్రస్టులో జమ కావడం లేదు. దీనిని ఆర్టీసీయే వాడేసుకుంటోంది. 2014 నుంచి మధ్య మధ్యలో కొంత జమ చేసినా.. ఇప్పటి వరకూ వాడేసుకున్న సొమ్ము రూ.826 కోట్లుగా తేలింది. కార్మికులకు సంబంధించిన పీఎ్‌ఫను ఏళ్ల తరబడి జమ చేయకపోవడంతో పీఎఫ్‌ కమిషనరేట్‌ రెండుసార్లు ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసులు పంపింది. 2016లో ఒకసారి, 2017లో మరోసారి ఇలాంటి నోటీసులు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. అయినా, కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని మరీ ఆర్టీసీ యాజమాన్యం డబ్బు బదలాయించకుండా వాడేసుకుంటోంది. రెండేళ్ల నుంచి పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ నిలిచిపోయాయి. దీంతో, ఆగ్రహించిన పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. అయినా.. సంస్థలో మార్పు లేదు. కార్మికుల సొమ్ముపై కించిత్తు ఆందోళన లేదు. సాధారణంగా కార్మికులకు పీఎఫ్‌ సొమ్మును డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. వారి పీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము లేకపోవడంతో ఆపత్కర సమయాల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునే వీలుండడం లేదు. ఇప్పటి వరకూ 7000కుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీనిపై ఆగ్రహించిన కార్మికులు సమ్మెకు దిగారు.

మరో వెయ్యి కోట్లు కూడా
పీఎఫ్‌ సొమ్ము మాత్రమే కాదు.. సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ పథకాల కింద కార్మికులు జమ చేసుకుంటున్న డబ్బును ఏళ్ల తరబడి ఆర్టీసీ నంజుకుని తినేస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకూ వెయ్యి కోట్లకుపైగా వాడుకున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. రిటైరైన సిబ్బందికి సెటిల్‌మెంట్‌ కింద చెల్లించే సొమ్మును కూడా వెంటనే ఇవ్వడం లేదు. కార్మికులు, అధికారులందరికీ కలిపి ఆర్టీసీలోనే క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఉంది. ప్రతి కార్మికుడు, అధికారి నెలవారీ వేతనం నుంచి 7 శాతం చొప్పున యాజమాన్యం మినహాయించి సీసీఎ్‌సకు బదలాయిస్తుంది. ఇలా జమయిన సొమ్ము నుంచి కార్మికులు తమ అవసరాల కోసం రుణాలు తీసుకుంటారు. కానీ..సీసీఎస్‌ కింద రుణాలను గత మే నెల నుంచి నిలిపివేశారు. అదేమంటే.. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌ సొమ్మును బదలాయించలేదని పాలకమండలి చెబుతోంది. ఈ బకాయిలు రూ.520 కోట్ల వరకూ ఉన్నట్లు తేలింది. ఇక, కార్మికుల కోసం ‘స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ (ఎస్‌ఆర్‌బీఎస్‌)’ అమల్లో ఉంది. కార్మికుల వేతనం నుంచి నెలకు రూ.250 చొప్పున మినహాయిస్తున్నా.. ఎస్‌ఆర్‌బీఎస్‌ ఖాతాలో జమ చేయడం లేదు. దీంతో రిటైర్‌ అయినవారు కనీస పెన్షన్‌ పొందలేకపోతున్నారు. మరోవైపు, కార్మికుల కోసం ‘స్టాఫ్‌ బెనివొలెంట్‌ కమ్‌ థ్రిఫ్ట్‌ (ఎస్‌బీటీ)’ ఫండ్‌ కూడా అమల్లో ఉంది. దీనికింద ప్రతి కార్మికుడి వేతనం నుంచి యాజమాన్యం నెలకు రూ.100 చొప్పున మినహాయిస్తోంది. తద్వారా ప్రమాదాల్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కానీ.. ఈ సొమ్మునూ జమ చేయకుండా ఆర్టీసీయే వాడేసుకుంటోంది. ఇలా ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీలకు సంబంధించి రూ.1000 కోట్లను ఆర్టీసీ వాడుకుందని కార్మిక యూనియన్లు భగ్గుమంటున్నాయి.
Courtesy Andhra Jyorthy..

RELATED ARTICLES

Latest Updates