వచ్చే ఎలక్షన్స్ లో BJP పార్టీ సౌత్ ఇండియాలో బలపడితే ఇక్కడి దళిత క్రైస్తవులే నెక్స్ట్ టార్గెట్ అవుతారు. ఎందుకంటే మైనారిటీ మతస్తుల (ముస్లిం, క్రిస్టియన్) పైన మారణ హోమాన్ని చేసిన వారిని సన్మానిస్తు, పదవులు ఇస్తూ హీరోలుగా కీర్తిస్తున్న BJP, RSS, Bajrang Dal సంస్థల ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం.

ఇందుకు వందల ఉదాహరణలు: 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీకి చెందిన గ్రాహం స్టెయిన్స్ మరియు అతని కుమారులు 11 సంవత్సరాల ఫిలిప్, 7 సంవత్సరాల తిమోతి లను ఒడిశా రాష్ట్రంలో 1999 జనవరి 22-23 రాత్రి జంగిల్ క్యాంప్‌కు వెళ్తుండగా బజరంగ్ దళ్ సభ్యులు కారును ముట్టడించి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి కాల్చి చంపారు.ఈ దాడిలో పాల్గొన్న దారా సింగ్ అతని అనుచరులకు ఉరి శిక్ష వేస్తే ఒరిస్స్సా హై కోర్ట్ ఉరి శిక్షను లైఫ్ సెంటెన్స్ గా మార్చింది. తర్వాత దారా సింగ్ అమ్మ గారికి RSS గొప్ప మాతృమూర్తి అని బిరుదు ఇచ్చి, ఇంత మంచి కొడుకుని కన్నందుకు RSS పాతిక వేల రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వడం అనేది RSS బ్రాహ్మణీయ సంస్కృతిలో చాలా సామాన్యమైన విషయం.

మరింత హేయమైన విషయం ఏమిటంటే, క్రిమినల్ బెదిరింపులు, మత అల్లర్లు, జాతి వివక్ష వంటి అంశాలతో అల్లర్లు రేపి క్రిమినల్ కేసులతో పాటు దోపిడీకి సంబంధించి – పదుల సంఖ్యలో తీవ్రమైన కేసులను ఎదుర్కుంటున్న ప్రతాప్ సారంగి గ్రాహం స్టెయిన్స్ హత్య్హ జరిగిన సమయం 1999లో ఒడిషాలోని బజరంగ్ దళ్‌కు చీఫ్‌గా ఉన్నారు, సారంగి అనుచరుడు బజరంగ్ దళ్‌లో కీలక సభ్యుడు అయిన దారా సింగ్ అతని అనుచరులు కొంతమంది కలిసి గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు చిన్నారులను సజీవ దహనం చేశారు. దీని ప్రతిఫలంగా ప్రతాప్ సారంగికి 2019 లో మోడీ కాబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు.అభివృద్దిని పక్కన పెట్టి భారత దేశాన్ని పూర్తి హిందూ రాష్ట్ర గా మార్చాలి అనే ఎజెండాతో ఘర్ వాపసి లాంటి కార్యక్రమాలు, హిందూ మతంలో కుల వివక్షకు గురవుతున్న దళితులు మతం మారకుండా “Anti Conversion Bill” లాంటి ఆయుధాలతో BJP మెల్లగా దేశం మొత్తం మత విద్వేష విషాన్ని నింపుతుంది.ఎవరి ఎజెండా ఏమిటో గుర్తించి ఇప్పటినుంచే జాగ్రత్త పడకపోతే రేపు మా జాన్ పేట లాంటి దళిత గ్రామాల్లో అతివాదుల చేత హింస జరగడానికి ఎంతో కాలం కనిపించడం లేదు.2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు దాడులు, 2007 అజ్మీర్ దర్గా దాడి2008 మాలెగావ్ పేలుళ్లు ఎవరు చేశారో, Saffron terror అంటే ఏమిటో గూగుల్ చేసి చూడండి చాప కింద నీరులా మన చుట్టూ విస్తరితున్న హిందూ తీవ్రవాదం గురించి తెలుస్తుంది.
~ విజయ్ కుమార్ వి – fb.com/zoominvj