కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని రామవరం గ్రామ సర్పంచ్ గా గెలిచిన గరికిముక్కల మరియమ్మ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ రామవరం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే రామవరం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరిచర్ల శేఖర్ అడవి శివప్రసాద్ గంగుల వెంకటేశ్వరరావు, గుట్ల యోహాన్, కురేళ్ళ ఏసురత్నం, గుట్ల వెంకటరత్నం, ఇంటి భద్రిరాజు, మోర బెంజిమెన్, యాళ్ల దావీదు, కాశిరాజు, మహంకాళి,వీరాంజనేయులు యువకులు తదితరులు పాల్గొన్నారు.