పట్టింపు లేని యాజమాన్యాలు పాలకవర్గాలు…
జర్నలిస్టు కుటుంబ బాదిత సభ్యుడు
జర్నలిస్టు సేవలు చాలు ఒక్క నిముషం కుదురుగా నిలబడండీ..
మనలోకి మన కుటుంబంలోకి తొంగి చూసుకునే బాద్యత మనది. ఉరుకులు, పరుగుల దివాలా జీవితానికి కొన్ని క్షణాలయినా విరామమిద్దాం. ఇన్నేళ్ల నిరంతర, నిరంతరాయ శ్రమతో ఏమి సాధించుచున్నారు, ఏం కోల్పోయాం? స్థిమితంగా రెండు నిముషాలు ఆలోచిద్దాం. ఓ ఐదు నిముషాలయినా సమీక్షించుకుందాం. “క్షణం తీరిక లేదు – పైసా ఆదాయం లేదు” .. అన్నట్టే కదా జర్నలిస్టులుగా దశాబ్దాల తరబడి పని చేస్తున్నారు.. ఏ ఆశయాలతో ఈ వృత్తిలోకి వచ్చారో ఏ “విలువ”ల్లోకి పతనమయ్యారో? సమాజం కోసం ఏం చేయాలనుకున్నారో? చివరికి ఏమి అందిస్తున్నాయి సమాజాలు ప్రజాప్రతినిధులు?
మన కుటుంబానికి ఎంత సాధిస్తున్నారు, ఇంట్లో ఏమి కోల్పోయారు. ఒక్క పది నిమిషాలు స్థిరంగా నిలబడి ఆలోచించే వెసులుబాటును కల్లోలిత కరోనా కాలంలోనూ మనం కల్పించుకోలేమా?…
అలా అయితే చెప్పుకోడానికి మరేమీ ఉండదు. మన ప్రాణమే మనతో మిగలదు. ఈ నాలుగు నెలల్లో ఎందరో జర్నలిస్టు అన్నలను కోల్పోయాం? ఎందరి ప్రాణాలను బలిచేశాం? మరెందర్ని పణంగా పెట్టాం! గత నెలరోజులుగా జర్నలిస్టుల దుస్థితి మరెంత దయనీయంగా మారిందో చూస్తూనే వున్నాం. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక దుర్వార్త వింటూనే ఉంటున్నాము ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి విశ్రమించే లోపు గుండెలు పగిలే విషాద దృశ్యాలెన్నో చూస్తున్నాం. ఎవరికీ చెప్పుకోలేని మనో వేదనను అనుభవిస్తున్నాం. కడుపు నిండా తినగలుగుతున్నారా? ఆ ఆరు గంటలైనా కంటి నిండా నిద్రిస్తున్నారా? చస్తూ బతుకుతూ పడుతూ లేస్తూనే, కుటుంబానికి కాసింత మనశ్శాంతినయినా ఇవ్వగలుగుతున్నారా?
సరే .. ఇన్నాళ్లూ గడిచిందంతా స్వర్ణయుగమే అనుకుందాం. కాలరెగరేద్దాం. ఆత్మవంచన చేసుకుందాం. మనకు అలవాటే కదా..! కరోనా కల్లోలంలో మనకు కష్టమొస్తే, సాయం చేసిన వాడెవడైనా వున్నాడా? పోనీ, కనీసం మనసు విప్పి మాట్లాడిన వాడు వున్నాడా? అయ్యో పాపం .. అని స్పందించిన వాడున్నాడా? మన జీవనోపాధికే పనిచేశామని వొప్పుకుందాం. పాతికేళ్ల, ముప్పయ్యేళ్ళ జర్నలిస్టు కెరీర్ ను ఒక్కసారి వెనక్కి తిరిగి పోల్చుకుంటే.. వాడెక్కడున్నాడు? మనమెక్కడ కునారిల్లుతున్నాం! వేలకోట్లు కూడబెట్టిన యజమానులకు కానివాళ్ళంమయ్యాం. లక్షల కోట్లకు పడగలెత్తిన పాలకుల ముందూ పురుగుల కన్నా హీనంగా మిగిలాం. ఇకనైనా జర్నలిస్టు అన్నలారా జాగ్రత్తగ ఉండడమే? అదే మన కుటుంబానికి మన ప్రాణాలకు బరోస…..
మనోవేదనతో
కీర్తి.శే.జర్నలిస్టు యాదయ్య తమ్ముడు
మీ మీసాల మహేష్