యథేచ్ఛగా ‘మల్టీ’ సొసైటీల్లో దోపిడీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

యథేచ్ఛగా ‘మల్టీ’ సొసైటీల్లో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆర్థిక అక్రమాలు ₹.60వేల కోట్లుపైనే జరిగినట్టు సమాచారం.

ఈ వ్యవహారంలో ఫిర్యాదులున్నా  కేంద్రం పట్టించుకోని పరిస్థితి నెలకొందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని రాష్ట్రం లేఖ రాసింది.ఆర్థిక వ్యాపారాల పేరుతో… పెట్టుబడికి రెట్టిరపు లాభాలు ఇస్తామన్న ఆశలు పుట్టిస్తూ జనాన్ని దోచుకురటున్న సంస్థలు పెరిగిపోతున్నాయి. మల్టీ స్టేట్‌, మల్టీపర్పస్‌ కో ఆపరేటివ్‌ సొసైటీల పేరిట వుంటున్న ఆర్ధిక సంస్థలను నియంత్రించేందుకు కేంద్ర పరిధిలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ (సిఆర్‌సిఎస్‌) చర్యలు తీసుకో వాల్సి ఉన్నప్పటికీ ఆ సంస్థ పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఒక్క ఆరద్ర ప్రదేశ్‌లోనే ఇప్పటివరకు 60 వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును తిరిగి బాధితులకు అందించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అక్రమాల మూలాలను తొలగించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాలపై లోతైన చర్చ జరిగింది. ప్రధానంగా ఆదర్శ్‌ సంస్థ దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు అక్రమ లావాదేవీలు నిర్వహిరచినట్లు గుర్తిఃచారు. అధిక వడ్డీ, కమిషన్లు, అసలు మొత్తాన్ని మళ్లించడం వంటి ఆరోపణలు ఉన్నట్లు 2015లోనే గుర్తించారు. ఇక అగ్రిగోల్డ్‌ సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉరది. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు జనం సొమ్ము గల్లంతయ్యింది. ఈ సంస్థ కూడా అసలుకు రెట్టింపు స్థాయిలో తిరుగు చెల్లింపులు ఇస్తామని ఆశ చూపిరచి చేతులెత్తేసిన సంగతి విదితమే. ఆ సరస్థ ఆస్తులను వేలం వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండగా, ఈ అరశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అలాగే అక్షయ గోల్డ్‌లో రూ.384 కోట్లు, అభయ గోల్డ్‌లో రూ.629 కోట్లు, హీరా గ్రూప్‌లో ఆరు వేల కోట్లు చొప్పున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ సంస్థలు అన్నీ అధిక చెల్లింపులు ఆశతోనే డిపాజిట్లు వసూలు చేయడం గమనార్హం.

ఇలా ఉండగా మరికొన్ని సంస్థలపైనా ఎస్‌ఎల్‌సిసిలో చర్చించాలని నిర్ణయించారు. సహారా సహకార క్రెడిట్‌ సొసైటీలో రెండు వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు వివాదంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి ఖాతాదారులకు చెల్లించలేదన్నది ప్రధాన ఆరోపణ. అలాగే ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌కేర్‌లో రూ.3 వేల కోట్లు, వెల్‌ఫేర్‌ గ్రూప్‌లో రూ.1250 కోట్లు, ఇ-బిజ్‌లో వెయ్యి కోట్లు, విజిఓ రైడ్‌ అండ్‌ ఫన్‌ సంస్థలో రూ.85 కోట్లు, సన్‌మ్యాక్స్‌లో రూ.10 కోట్లు, బిట్‌కాయిన్‌లో రూ.35 కోట్లు, విస్‌డమ్‌ జాబ్స్‌లో రూ.70 కోట్లు, ఎలైట్‌ కనెక్ట్‌ కేర్‌లో రూ.25 కోట్లు, ప్రోహెల్దీవేలో 30 కోట్లు, సన్‌ పరివార్‌ గ్రూప్‌లో రూ.158 కోట్లు, గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌లో వంద కోట్లు చొప్పున అవకతవకలు జరిగినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, నివేదికలపైనా త్వరలో చర్చించాలని నిర్ణయించారు. మరో పది సంస్థల్లో జరిగిన అవకతవలు వాస్తవ విలువ ఇరకా గుర్తించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఇటువంటి సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం సిఆర్‌సిఎస్‌కు ఉన్నప్పటికీ ఆ సంస్థ పట్టించుకోవడం లేదన్న విషయాన్ని కేంద్రానికి వివరించనుంది. అలాగే సంస్థల అవకతవకల వివరాలను కూడా కేంద్ర ఆర్ధికశాఖకు నివేదించనున్నారు.

DRK. Raju 
Courtesy Prajashakthi..

RELATED ARTICLES

Latest Updates