కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కలిదిండి పట్టణంలో మేడికేర్ నూతన మందుల షాపును ప్రారంభించారు. ఈ సందర్బంగా మెడికల్ షాప్ ప్రొప్రయిటర్ చందు కృష్ణప్రసాద్, బండారు నాగరాజు, ఆలుమూరు శ్రీనివాసరాజు, MLA DNR గారికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు అనంతరం MLA DNR గారు రిబ్బన్ కటింగ్ చేసి మెడికల్ షాపును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో MLA DNR గారు మాట్లాడుతూ మెడికేర్ యాజమాన్యం 2013 సంవత్సరం నుంచి కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు పట్టణంలో అలాగే కలిదిండి పట్టణంలోను ప్రజలకు నాణ్యమైన మందులు అందించి వారి మన్ననలు పొందుతున్నారు అని, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈకార్యక్రమంలో AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, సర్పంచ్ ముత్తిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ నీలి సుమన్, చిట్టూరి బుజ్జి, వడుపు రామారావు, పెటేటి వివేకానంద, ఊర శ్రీధర్, గొరిపర్తి వెంకటరెడ్డి, చిట్టూరి వాసు, బత్తిన ఉమామహేశ్వరరావు, పోసిన రాజీవ్ భరత్, కందుల వెంకటేశ్వరరావు, పోసిన కొండ, గుడివాడ ఫణి, మండా నవీన్, షేక్ దాదాసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.