ప్రేమించి పెండ్లి.. తక్కువ కులమని లొల్లి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అల్లి నాగరాజు

బాదితురాలు సంగిత

ప్రేమించి పెండ్లి చేసుకున్న తన జీవితం నాశనం కావడానికి అధికార పార్టీ నాయకులు, ఓ పత్రికా విలేకరే కారణమని ఓ యువతి ఆరోపించింది. ఓ పేపర్‌ విలేఖరి అండతో తన భర్త తనకు విడాకుల నోటిసులు పంపాడని తెలిపింది. టిఆర్‌ఎస్‌ నాయకులు, ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలని ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అసలు వివరాలు ఏంటంటే…
వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారం గ్రామానికి చెందిన సంగీత, గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూపతి ప్రకాశ్‌లు ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కొంత కాలం కలిసి ఉండగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో సంగీతకు దూరంగా ప్రకాశ్‌ ఉంటున్నాడు. తన భర్తను తనతో కలిసి ఉండేలా చూడాలని అత్తగారింటికి వచ్చి సంగీత కోరింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు.
కొన్ని నెలలు కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మళ్లీ గొడవలు జరగడంతో ప్రకాశ్‌ విడాకుల కోసం నోటీసు పంపించాడు. దాంతో నాలుగు రోజుల క్రితం గుండ్రపల్లి వచ్చిన సంగీత తన భర్త జాడ తెలపాలని ప్రకాశ్‌ తల్లిదండ్రులను కోరింది. ప్రకాశ్‌ ఇక్కడికి రాలేదని, ఆమెను వారు ఇంట్లోకి రానివ్వలేదు. గత వారం భర్త వచ్చిన విషయం తెలుసుకొని సంగీత ప్రకాశ్‌ ఇంటికి వచ్చింది.
అయితే కేసు కోర్టులో ఉండగా ఎందుకు వచ్చావంటూ భర్త ప్రకాశ్‌ కోపంతో ఆమెను కొట్టాడు. తనకు ఓ పత్రికలో పనిచేసే అన్న సపోర్టు ఉందని, టిఆర్‌ఎస్‌ నాయకుల సపోర్టు కూడా ఉందని బెదిరించాడు. దాంతో మనస్తాపానికి గురైన సంగీత అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
సంగీతకు తండ్రి లేడు. తల్లి దీన స్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో సంగీత పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. తాము ప్రేమించి పెండ్లి చేసుకున్నామని అత్తగారి కుటుంబ సభ్యులు అతనికి లేని పోనివి చెప్పి మరో పెండ్లి చేయాలని చూస్తున్నారని తెలిపింది. తనకు తండ్రి లేడని తల్లి సాకలేని పరిస్థితి అని వివరించింది. అయితే పోలీసులు ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. సంగీత కోలుకున్నాక దీనిపై విచారణ వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
నా భర్త కాదంటే నాకు చావు తప్ప మరో మార్గం లేదు. నేను కట్న కానుకలు తీసుకురాకపోవడం, వేరే కులం కావడంతో ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు అతని మనసు మార్చి నన్ను దూరం పెట్టేలా చేశారు. విడాకుల నోటిసు చూసి షాకయ్యాను. మామూలుగా వచ్చిన గొడవకే విడాకుల నోటిసులు పంపిస్తారా? అంటూ కన్నీటి పర్యంతమైంది. నేను విడాకులివ్వను. భర్తతో కలిసి కాపురం చేస్తా.

RELATED ARTICLES

Latest Updates