న్యూఢిల్లీ, సెప్టెంబరు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్‌సింగ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్త రబ్డీదేవి, అడపడుచు మీసాభారతి తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని, వంటింట్లోకి కూడా రానీయడం లేదన్నారు. 6 నెలల కిందట ఆమెతో విడాకులు కోరు తూ తేజ్ ప్రతాప్ పిటిషన్ దాఖలు చేశారు. అయినా ఆమె తన అత్త రబ్డీ దేవి అధికార నివాసంలోనే ఉంటున్నారు. ‘‘మీసా నన్ను తరచూ కొడుతోంది. శనివారం రాత్రి కూడా కొట్టింది. ఇంట్లో నుంచి గెంటివేసింది’’ అన్నారు. తన తల్లిదండ్రులే భోజనం పంపిస్తున్నారని చెప్పారు.
Courtesy Andhrajyothi…