కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామ సర్పంచ్ గా గెలిచిన నాగదాసు తామస్ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ కానుకొల్లు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే కానుకొల్లు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుట్ల రాంబాబు, బూర్ల పెద్దిరాజు, కుందేటి నాగేశ్వరరావు, వీరంకి రమాదేవి, కునుకుర్తి శ్రీను, విష్ణుమూర్తుల శ్రీను, బాజీరావు, చిన్నమ్మ, పుట్టి సత్యనారాయణ, కాకర్ల కృష్ణారావు, శ్రీనివాసరావు, నెరుసు రవి, రామకృష్ణ,మోషే, వెంకన్న యువకులు తదితరులు పాల్గొన్నారు.