కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు స్థానిక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారు రాష్ట్ర ప్రజల ఆశీస్సులుతో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా పార్టీ జెండా ఎగురవేసి పార్టీ నాయకులకు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MLA DNR గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత మెజార్టీతో 151 మంది శాసనసభ్యులుతో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారికి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని, నా యొక్క కైకలూరు నియోజకవర్గం ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు.
ఈ యొక్క 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేసి వారికి అండగా వున్నాము అని అన్నారు, ముఖ్యంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసి, విని, నవరత్నాలను ప్రవేశపెట్టారు అని అధికారంలోకి రాగానే ఆ యొక్క నవరత్నాలను తేదీల వారీగా అమలు చేస్తున్నాం అని తెలిపారు, అదేవిదంగా సంక్షేమ పధకాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో C.C. రోడ్లు, పక్కా డ్రైనేజీ, నాడు నేడు, గ్రామ సచివాలయలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించాం అని, రాష్టంలో పేద అక్క, చెల్లమ్మలకు 32 లక్షలు మందికి ఇంటి స్థలాలు ఇచ్చాము అని, త్వరలోనే ఇంటి నిర్మాణాలను కూడా మొదలుపెడుతున్నాం అన్నారు, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న పరిపాలనలో మేము ప్రజలకు సేవ చేయడం మా అదృష్టం అని అన్నారు, కైకలూరు నియోజకవర్గం ప్రజల సహకారంతో కైకలూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలిపారు, నా యొక్క విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదములు అని, మీ అందరికి కూడా నేను ఎప్పుడు తోడుగా వుంటాను అని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ D.M. నవరత్నకుమారి, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహ్మద్ జహీర్, షేక్ రఫీ, AP రెడ్డి సంక్షేమ సంఘం కన్వీనర్ బలరామారెడ్డి, నిమ్మల సాయిబాబు, అల్లూరి మంగారావు, నిమ్మల శ్రీనివాస్, ఈదా లక్ష్మణ్, కూనవరపు సతీష్, తులసి పూర్ణ, సయ్యద్ బాషా, విజయ్, మూడెడ్ల నాయుడు, గునిపూడి జ్యోతి, కిరణ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.