
నూతనంగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలని, మీ తరుపున, నా తరుపున ముఖ్యమంత్రి జగనన్నకు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు. ఈ ఉదయం కైకలూరు పట్టణంలోని ఎంపీడీఓ గారి కార్యాలయం వద్ద పంచాయతీ EO లక్ష్మినారాయణ గారి ఆధ్వర్యంలో కొత్తగా పెన్షన్లు మంజూరు వచ్చిన 72 మందికి నూతన ఫెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో MLA DNR మాట్లాడుతూ ముందుగా కైకలూరు మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలకు 21 ఎంపీటీసీలు, అదేవిదంగా జడ్పీటీసీ అత్యంత మెజార్టీతో గెలిపించిన మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం అని అన్నారు, అలాగే ఈ రోజు ప్రజాప్రతినిధులుగా గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న పరిపాలనలో మనం పని చేయడం మన అందరి అదృష్టం అని ప్రజల ఆశీస్సులతో గెలిచిన మీరు అందరు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలని నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎపిటీసీ లను ఆదేశించారు. అదేవిదంగా జగనన్న సైన్యం, గ్రామ వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రతి సంక్షేమ పధకాన్నికి అర్హులు అయినా వారి పేర్లు ఎప్పటికి అప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు అని అన్నారు. ఇప్పటికి కైకలూరు పట్టణంలో 1420 మందికి ఫెన్షన్లు ఇస్తున్నాం అని ఈ రోజు 72 మందికి నూతన ఫెన్షన్లు 1లక్ష 42 వేలు రూపాయలు ఇస్తున్నాం అని అన్నారు. మన జగనన్న మీ కోసం 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే మీ ఇంటికి వచ్చి ఫెన్షన్ ఇచ్చే వ్యవస్థ తెచ్చి దేశవ్యాప్త కీర్తిని అందుకున్నారు అని అన్నారు ,గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పధకం కూడా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు అని, ఎక్కడ అవినీతికి తావులేకుండా, వాలంటరీలు, సచివాలయం ఉద్యోగుల ద్వారా అర్హులు అయిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు ఇస్తున్నారు అని అన్నారు. అగ్రకులాలలోని అర్హులైన పేద అక్కచెల్లమ్మలకు ఈ నెలాఖరికి EBC పధకం ద్వారా 45 నిండిన అక్కచెల్లమ్మలకు లబ్ది ఇవ్వడం జరుగుతుందని అని అన్నారు.సభకు అధ్యక్షత వహించిన ఎంపిపి అడివి కృష్ణ మాట్లాడుతూ పెన్షన్ తీసుకోవడం కోసం పంచాయితీ కార్యాలయం వద్ద పడిగాపులు పడే అవస్థను తొలగించి గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు వ్యవస్థను తెచ్చి సూర్యోదయానికి ముందే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్న ఘనత మన సీఎం జగనన్నదే అన్నారు. జగనన్న పిలుపు ను అందిపుచ్చుకుని నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలువుతున్నానని అన్నారు. సర్పంచ్ DM నవరత్న కుమారి మాట్లాడుతూ జగనన్న పాలనలో DNR గారి హయాంలో ప్రజాప్రతినిధులుగా తాము ఉండడం తమ అదృష్టం అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఎంపీటీసీలు, మంగినేని రామకృష్ణ, మూడెడ్ల శశికళ, తెంటు సత్యనారాయణ, సైదు లక్ష్మి, బోడావుల తిరుపతిరాజు, సాదు కొండయ్య, నల్లగచ్చు ధనలక్ష్మి, సర్పంచ్ లు జయమంగళ కాసులు, చెరుకువాడ బలరామరాజు, ఘంటసాల శేషారావు, ఉలిసి వసంతకుమారి, కైకలూరు ఉప సర్పంచ్ మంగినేని పోతురాజు
నాయకులు నల్లగచ్చు బాబులు, నిమ్మల శ్రీనివాస్, నిమ్మల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.