
ముదినేపల్లి మండల ప్రజలు YSRCPపార్టీని ఆదరించిన తీరు, రాజన్న రాజ్యంలో జగనన్న పాలన పట్ల ప్రజలు చూపించిన విశ్వాసానికి నిదర్శనం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. ముదినేపల్లి మండల జడ్పీటీసీ శ్రీమతి ఈడే వెంకటేశ్వరమ్మ గారి విజయోత్సవ ర్యాలీలో
సంకర్షణపురం నుంచి ముదినేపల్లి వరకు ముఖ్య అతిధిగా Kaikaluru MLA DNR గారు పాల్గొన్నారు. మచిలీపట్నంలో పదవీ ప్రమాణ స్వీకారాలు చేసి నియోజకవర్గ పరిధిలోకి వచ్చిన వెంటనే DNR గారికి నియోజకవర్గం లోని నాలుగు మండలాల జడ్పీటీసీ సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, కురెళ్ల బేబీ, ముంగర విజయనిర్మల, బొర్రా సత్యవతి లకు పెద్దఎత్తున YSRCP శ్రేణులు స్వాగతం పలికారు. ముదినేపల్లి ZPTC ఆధ్వర్యంలో ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు,వైస్ చైర్మన్ బొర్రా శేషుబాబు, రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ గంటా సంధ్య, ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా Kaikaluru MLA DNR గారు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గ చరిత్రలో ఇంత వరకు ఏ పార్టీకి ఇవ్వని మెజార్టీ, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆశీస్సులతో మనకి ప్రజలు ఇచ్చారు అని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీలు 67 మంది ఎంపీటీసీలు, నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కారం చూపుతారు అని అన్నారు. ముదినేపల్లి మండలంలో జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ గారికి 16517 ఓట్ల మెజారిటీ ఇచ్చారు అని, అదేవిదంగా 16 ఎంపీటీసీ స్థానాలకు 8 స్థానాలు ఏకగ్రీవం కాగా, 8 స్థానాలకు పోటీ జరిగితే 8 స్థానాలు అత్యంత మెజార్టీతో YSRCP అభ్యర్థులు గెలిచారు అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి అని, అర్హులు ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు, వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు నమోదు చేస్తే, సరాసరి లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లకే వేస్తున్నారు అని, రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా, కులమతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా, అర్హులు అయిన అక్కచెల్లమ్మలకు 30 లక్షలు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు అని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో మీకు పూర్తిగా సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా వుంటాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు చొప్పర్ల సునీత, పాతూరి అంజయ్య, జాస్తి చంటి, నిమ్మగడ్డ బిక్షాలు, ఈడే వెంకటేశ్వరరావు, మొట్రు యేసు, ముత్యాల రాంబాబు, రామచంద్రరావు, మర్రి వీరారెడ్డి, శీలం రామకృష్ణ,షేక్ అల్లాబక్షు, గండికోట ఏసుబాబు, అనగాని రామకృష్ణ, వీరమల్లు కొండలరావు, రాచూరి కుమార్, తాడంకి రాజేష్, బేతపూడి రాజా, సాక్షి సాయిబాబు, మంచాల గంగాధరరావు, జంపాన కోటయ్య పాల్గొన్నారు.