
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్ని సాంప్రదాయబద్దంగా జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు అనుసరించి, అమ్మవారిని దర్శించి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కైకలూరు శాసనస్సుభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) కోరారు.ఈ ఉదయం పట్టణంలోని శ్యామలాంబ అమ్మ వారి ఆలయ చైర్మన్ శ్రీమతి తెలగంశెట్టి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో, శ్రీ రామలింగేశ్వరస్వామి, మరియు శ్యామలాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించారు. అనంతరం రేపు 7 వ తారీఖు నుంచి 15 తారీఖు వరుకు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరణ చేశారు., ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ, భక్తులు అందరు శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, శ్రీ శ్యామలాంబ అమ్మవారిని దర్శించి, ఉత్సవాల్లో భాగంగా జరిగే మహా చండీ యాగం లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ EO శేఖర్. ఎంపీపీ అడవి కృష్ణ,రామలింగేశ్వర ఆలయ చైర్మన్ ఉప్పులూరి ఉషాపద్మజ, సర్పంచ్ D.M. నవరత్నకుమారి, వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ భాస్కర వెంకటేశ్వరరావు, తెలగంశెట్టి శ్రీనివాసరావు, బురుబోయిన మోహనరావు, పంజా రామారావు, మంగినేని రామకృష్ణ, వసుందర మురళీ , బొర్రా శ్యాంసుందర్, ఉప్పులూరి శర్మ, కటికన రఘు, బోను సుజాత, చింతల శ్యామల,పైడిమర్రి నరసింహరావు, కనుమూరి రమాదేవి, సొల్లేటి మాధవి, నున్న రాంబాబు, జాజుల రాజు, నిమ్మల శ్రీను, కరేటి రాంబాబు,తదితరులు పాల్గొని శ్రీ శ్యామలాంబ అమ్మవారిని దర్శించారు.