
తల్లుల ఆలనా, పిల్లల పాలనా నిరంతరం దగ్గరుండి చూసుకుంటూ ఉపయుక్తమైన సేవలను గణనీయంగా అందించే అంగన్వాడీ వ్యవస్థ సమాజానికి చేస్తున్న మేలు ప్రశంసనీయమైనదని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా కైకలూరు ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్నం కైకలూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత కైకలూరు CDPO ప్రసన్న విశ్వనాథ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకగా ప్రాజెక్టు లక్ష్యాలు-అందించే సేవలు కళ్ళకు కడుతూ తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులను, స్టాల్స్ లో ఏర్పాటు చేసిన రకరకాల పౌష్టికాహార పిండివంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో జగనన్న పాలనలో తల్లీ బిడ్డల సంక్షేమకోసం నిత్యం పాటు పడుతున్న మీ సేవలు నిరూపమానమైనవని అన్నారు. సృష్టిలో అన్నిటికంటే తియ్యని మాట “అమ్మ” అని.. అమ్మలా సమాజానికి సేవలదింస్తున్న అంగన్వాడీ కార్యకర్తల జీవితాలు ధన్యం అన్నారు. మన ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదని.. గర్భధారణ సమయం మొదలుకొని.. ప్రసవం జరిగి.. పుట్టిన బిడ్డ ప్రాథమిక పాఠశాల కు వెళ్లే పర్యంతం తల్లీ బిడ్డల ఆరోగ్యం, సంక్షేమం, ఆహారం, విద్య పట్ల అనితరసాధ్యసేవలు అందిస్తున్న వ్యవస్థ మీదని అన్నారు. అందుకే మీ ప్రాధాన్యత ను జగనన్న గుర్తించి మీకు ఇచ్చే వేతనాలు పెంచడం జరిగిందని అన్నారు. మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులని చూసారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి ని ఇప్పుడే చూస్తున్నారని అన్నారు.పాలనను ప్రజలకు చేరువ చేస్తూ గ్రామ వాలంటీర్ వ్యవస్థను,సచివాలయ వ్యవస్థను తెచ్చి గ్రామస్వరాజ్య స్థాపనను సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదేనని అన్నారు. ఒక సమర్ధ అధికారిణి పర్యవేక్షణలో కైకలూరు ప్రాజెక్టు మంచి పనితీరు కనబరుస్తున్నారని సీడీపీఓ గారికి వారి టీముకి ప్రత్యేక అభినందనలు తెలువుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు CDPO ప్రసన్నవిశ్వనాధ, కైకలూరు సర్పంచ్ DM నవరత్న కుమారి, కైకలూరు కలిదిండి ఎంపిపిలు అడివికృష్ణ, చందన ఉమామహేశ్వరరావు, కైకలూరు జడ్పీటీసీ కురెళ్ల బేబీ, కలిదిండి మార్కెట్ యార్డ్ చైర్మన్ నీలపాల వెంకటేశ్వర రావు, రాష్ట్ర క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి,
కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ రఫీ,కైకలూరు మండల వైస్ ఎంపిపి మహమ్మద్ జహీర్, నాయకులు చిట్టూరి బుజ్జి, నిమ్మల సాయి, ICDS సూపర్ వైజర్లు, కైకలూరు కలిదిండి మండలాల అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.