
పేద అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు కూడా ఇవ్వడం ఒక మహోన్నత మహాత్ముని జయంతి రోజున చెయ్యడం చాలా సంతోషంగా ఉందని కైకలూరు MLA దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు. ఈ సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో, మండలంలోని అటపాక గ్రామ పంచాయతీలోని జాన్ పేట 10 ఎకరాల YSR జగనన్న గ్రీన్ లే అవుట్ లో ఈ రోజు 2వ లే అవుట్ లో 24 మంది పేద అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఎమ్మెల్యే పంపిణి చేశారు, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ, అర్హులు అయిన మీ అందరికి ఈ రోజు, జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్బంగా, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆశీస్సులతో జాన్ పేట జగనన్న లే అవుట్ లో ఇప్పటికే 232 అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చాము అని, ఇప్పుడు మీ 24మంది అక్కచెల్లమ్మలకు ఇవ్వడం జరిగిందని ఇది మీ అందరి అదృష్టం అని, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆశీస్సులతో మీకు ఇంటి నిర్మాణాలకు పూర్తిగా అనుమతులు లభించాయని, మీరు అందరు కూడా రేపటి నుంచే ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టాలని తెలిపారు,, ముఖ్యంగా అర్హులు అయి,ఇంటి పట్టాలు తీసుకున్న ప్రతి అక్కచెల్లమ్మ కూడా ఇంటి నిర్మాణాలు త్వరగతిన మొదలుపెట్టి, నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు., ముఖ్యంగా ఇంటి నిర్మాణాలకు 1.లక్ష80 వేలరూపాయలు జగనన్న ఇస్తున్నారు అని, అదేకాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా 50 వేల రూపాయలు ఇస్తున్నారు అని, అక్కచెల్లమ్మలు ఈ యొక్క పధకాలను వినియోగించుకొని త్వరగతిన నిర్మాణాలు చేసుకోవాలని కోరారు,, ఇంకా అటపాక గ్రామంలో 50 మంది అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని, గ్రామంలోని అగ్రహారం రోడ్డులో త్వరలోనే మెరక పూడ్చి వాళ్ళకి కూడా ఇంటి పట్టాలు ఇచ్చి, నిర్మాణాలకు అనుమతులు ఇస్తాను అని అన్నారు,, ఇంటి పట్టా వచ్చిన ప్రతి అక్కచెల్లమ్మ కూడా నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని, ఆలా కాకుండా ఎవరైనా నిర్మాణాలు చేసుకోలేకపోతే,ఆ యొక్క ఇంటి పట్టా అర్హులు అయిన ఇంకో అక్కచెల్లమ్మకు ఇస్తాం అని అన్నారు,, ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ అడవి కృష్ణ, మండల వ్యవసాయం సలహా చైర్మన్ వేగేసిన రంగరాజు, PACS అధ్యక్షులు పంజా రామారావు, ఎంపీటీసీలు తమ్మిశెట్టి లక్ష్మి,, పట్టపు బాలమ్మ,గ్రామ పార్టీ అధ్యక్షులు తలారి జాన్ విల్సన్, వైస్ సర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు (పాము ), కన్న రమేష్, కన్న బాబు, వడ్లని వెంకటేశ్వరరావు, కూనవరపు సతీష్, సిద్దబత్తిన శ్రీరామ్మూర్తి, పోతన మల్లికార్జునరావు, తమ్మిశెట్టి కొండ, తదితరులు పాల్గొన్నారు.