మరో కుల దురహంకార చర్య…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామరావుపేట్ గ్రామానికి చెందిన తుంగపిండి హరికృష్ణ s/o మల్లయ్య sc మాదిగ కులానికి చెందిన అబ్బాయి చదువు BSc (B.ED)TTC..,పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తనుగుల సాధ్వి d/o వెంకటేశ్వర్లు బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి…ఇరువురు ప్రేమించుకొని 2015 మార్చి 17 న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రేమ పెళ్లి(కులాంతర వివాహం) చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ జరిగింది,అమ్మాయి తల్లి తండ్రులు నాకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదని,తాను చనిపోయినా కూడా తన కూతురు తన ఇంటికి రాకూడదని చెప్పి బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇచ్చారు…

అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అబ్బాయి స్వగ్రామంలో కాపురం పెట్టినారు, పెళ్ళైన మరుసటిరోజు నుండి అమ్మాయి తండ్రి మెల్లగా తన కూతురుతో ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టాడు, నమ్మించాడు.

3 నెలల తరువాత అబ్బాయి అక్కడి నుండి మకాం మార్చి టీచర్ ఉద్యోగం కోసం పెద్దపల్లి లో ఒకరి ఇంట్లో అద్దెకి ఉంటే ఆ ఇంటి యజమాని కి నువ్వు నా కూతురిని అల్లుడిని విడగొడితే ప్రభుత్వ ఉద్యోగం పెట్టిస్తానని ఆ ఇంటి యజమాని కి ఆశ చూపాడు,విషయం తెలుసుకున్న హరికృష్ణ అక్కడి నుంచి హజీపూర్ గ్రామం కి వెళ్లగా అక్కడ ఉంటున్న ఇంటి యజమానికి కూడా డబ్బుల ఆశ చూపి కూతురిని అల్లుడిని విడగొట్టాలని పథకం వేసాడు.

ఇది తెలుసుకున్న హరిక్రిష్ణ దంపతులు ఎక్కడున్నా ఇదే పరిస్థితి ఉందని భావించి తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు,అప్పటికీ ఆగకుండా అమ్మాయి తండ్రి, తన కూతురికి తరచూ ఫోన్ చేస్తూ ఇంటికి రావాలని దళిత మాదిగ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని, వాళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళని మాయ మాటలు చెప్పి,వెంటనే ఆ మాదిగొడిని వదిలి ఇంటికి రావాలని,నువ్వు రాని యెడల నేను,అమ్మ,తమ్ముడు అందరం కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.అయినా ఆ అమ్మాయి వినకపోయే సరికి ఊరిలోకి వచ్చి ఆ గ్రామ సర్పంచ్(మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి) సమక్షంలోనే అమ్మాయి తల్లితండ్రులు అమ్మాయి ని బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారు,అబ్బాయి తన భార్యను ను చూడటానికి ,ఇంటికి వెళ్తే కలవనివ్వటం లేదు, కాల్ చేస్తే మాట్లాడనివ్వటం లేదు… ఇంటికి వెళ్తే బండ బూతులు తిడుతున్నాడు అమ్మాయి తండ్రి, తన కూతురికి విడాకులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు..తన భార్య లేకుండా బతకలేనని అంటున్నాడు అబ్బాయి.5 సంవత్సరాలు కలిసి జీవించిన దంపతులను కుల అహంకారం తో విడతీయటమే కాకుండా అబ్బాయి ని చంపడానికి కూడా వెనుకాడటం లేదు అమ్మాయి తండ్రి వెంకటేశ్వర్లు..,మధ్యవర్తులతోని చెప్పి కావాలంటే ఆ మాదిగొనికి డబ్బులు ఇస్తాను నా కూతురిని వదిలేయమని చెప్పండి అని,విడాకులు ఇవ్వమని చెప్పి బేరసారాలు మాట్లాడుతున్నాడు.అబ్బాయి కి ప్రాణ హాని ఉన్నది,మరో ప్రణయ్,మంథని మధుకర్,ఆంబోజ నరేష్ లాగా కాకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది, దళిత కులం లో పుట్టడమే అతడు చేసిన నేరమా…ప్రేమించడం ఇంత పాపమా..ఇంకా ఎన్ని రోజులు ఈ దారుణాలు..దయచేసి హరికృష్ణకు న్యాయం జరిగేలా మనవంతు సహాయం చేద్దాం…కులరక్కసి చేతిలో మరో దళిత ప్రేమికుడు ప్రాణాలు కోల్పోకుండా చూద్దాం…

RELATED ARTICLES

Latest Updates