వ్యవస్థలపై రాజకీయ నీడ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆర్బీఐలో పెరిగిన కమలనాధుల జోక్యం
ప్రశ్నార్థకంగా నిటిఆయోగ్‌, గణాంక సంస్థల విశ్వసనీయత
వడ్డీరేట్ల సవరణలకే ఆర్బీఐ పరిమితం
లక్షల కోట్లున్న నిల్వ నిధులపై కేంద్రం కన్ను : ఆర్థికరంగ నిపుణులు
ప్రజాస్వామ్యం బలంగా ఉండటం కోసం మనదేశంలో కొన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని రాజకీయ జోక్యానికి దూరంగా ఉంచారు. భారత రాజ్యాంగం వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ఎన్నికల కమిషన్‌, న్యాయవ్యవస్థ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గణాంక శాఖ…మొదలైనవాటిని రాజకీయ జోక్యానికి దూరంగా ఉంచారు. అయితే ఈ నీతి…ఈ రివాజు దారితప్పడంతో ఇండియాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశం ఆర్థికమాంద్యంలో మునగడానికి కారణం ఆర్బీఐలో పెరిగిన రాజకీయ జోక్యమేనని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. 
న్యూఢిల్లీ : ”ఏ దేశంలోనైనా రాజకీయ, ఆర్థికరంగాల్లో కొన్ని కీలక వ్యవస్థలు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటూ వెళ్లిపోవాలి. రాజకీ య నాయకత్వం అభివృద్ధి ప్రణాళికలు వేసినప్పుడు, కీలకమై న వ్యవస్థల్ని పరిగణనలోకి తీసుకోవాలి. వాటి గణాంకాలు, పరిశోధనతో కూడిన సలహాల్ని స్వీకరించాలి. లేదంటే దు ష్ఫరిణామాలు రావటం ఖాయం” అని 25ఏండ్ల క్రితం ప్ర ముఖ ఆర్థికవేత్త, నోబెల్‌పురస్కార గ్రహీత ఓలీవర్‌ విల్లి య మ్సన్‌ చెప్పినమాట, ఇప్పుడు ఆర్థికమాంద్యంలో మునిగిన భారత్‌కు సరిగ్గా సరిపోతున్నదని ఆర్థికవిశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇంధనం కరువైన బండిలా తయారైంది. ముందుకు కదల్లేక చతికిలపడింది. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం లేదా డిమాండ్‌-సరఫరా పడిపోవటం…అని జాతీయ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. ‘ఆర్బీఐ’ స్వతంత్ర కోల్పోవటం, కేంద్రం జోక్యం పెరగటం మాంద్యం పరిస్థితుల్ని తెచ్చిపెట్టిందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ, కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ), నిటి ఆయోగ్‌(గతంలో ప్రణాళికా సంఘం) మొదలైనవి …మునుపెన్నడూ లేనంతగా రాజకీయ జోక్యానికి గురయ్యాయని వారు గుర్తుచేస్తున్నారు.

నిటి ఆయోగ్‌తో అయ్యేదెంత?
పరిశోధన, కచ్చితత్వంతో కూడిన గణాంకాల ఆధారంగా విధాన రూపకల్పన చేసే సంస్థ ప్రణాళికా సంఘం. మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్‌ వచ్చీరావటంతోనే ‘ప్రణాళిక సంఘా’న్ని రద్దుచేశారు. దాని స్థానంలో ‘నిటి ఆయోగ్‌’ను ఏర్పాటుచేశారు. సమ్మళిత వృద్ధి కోసం మధ్యంతర ప్రణాళికలు, విధానాలు రూపొందించే వ్యవస్థను కాదనుకున్నారు. శాస్త్రీయ అధ్యయనం లేని నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. నిటి ఆయోగ్‌ నిర్వహించే పాత్ర ఇప్పటికే పూర్తిగా రాజకీయమయమైంది. ప్రణాళికాసంఘం సంపాదించుకున్న విశ్వసనీయత దీని నుంచి ఊహించటం కష్టమేనన్న మాట వినబడుతోంది.

మానవ సమాజంలో మానవుడు ఏర్పరచుకున్న వ్యవస్థలు(ఆర్బీఐ, ఈసీ, నిటి ఆయోగ్‌..) నియమాలు, నిబంధనలు తెలుపుతాయి. మానవుల మధ్య, మానవులకు..సంస్థలకు మధ్య జరిగే లావాదేవీలను నిర్దేశిస్తాయి. ఈ ప్రక్రియలో అనిశ్చిత వాతావరణం లేకుండా చేస్తాయి. జరిగిన ఉత్పత్తికి విలువ కడతాయి. అయితే వ్యవస్థల నిబంధనల్ని మోడీ సర్కార్‌ ఒక్కరోజులో మార్చేసింది. స్వతంత్ర వ్యవస్థలకు సంబంధించిన నిర్ణయాల్ని ‘అధికార రాజకీయం’ తీసుకుంటోంది. భారత ఆర్థికరంగంలో వస్తున్న ఫలితాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

సమాచారమంతా పక్కదారి ..
మానవ సమాజం ప్రస్తుతం ‘సమాచార యుగం’లో నడుస్తోంది. వ్యక్తులుగానీ, సంస్థలు గానీ ఏ నిర్ణయం తీసుకోవా లన్నా దాని వెనుక ఉండే ఆధారం ‘సమాచారం’. అందునా ప్రభుత్వ సంస్థల నుంచి విడుదలయ్యే సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు ఏదేశంలోనైనా నిరుద్యోగం ఎక్కువగా ఉందంటే, ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. కారణం అత్యంత చవకైన కార్మికశక్తి లభిస్తుందన్నది వారి అంచనా. అయితే వాస్తవ పరిస్థితిని తెలిపే గణాంకాల్ని దాచే ప్రయత్నం మోడీ సర్కార్‌ చేసింది. గణాంక పద్ధతుల్ని మార్చేశారు. సంస్థల్లో వ్యక్తుల్ని మార్చేశారు. చివరికి సంస్థ పేరునే మార్చేశారు. ఇప్పుడున్న ‘కేంద్ర గణాంక సంస్థ’ (సీఎస్‌ఓ) విశ్వసనీయత చాలా తక్కువ. నిరుద్యోగం ఎక్కువైందన్న సంగతి దాయాలనుకుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉన్న నిరుద్యోగులకు నష్టం జరుగుతోంది.
ఆర్బీఐపై దెబ్బమీద దెబ్బ…
ద్రవ్య చెలామణికి సంబంధించి విధాన పరమైన నిర్ణయాలన్నీ ఆర్‌బీఐ తీసుకోవాలి. ప్రజల చేతుల్లో నగదు ఎంత ఉండాలి? బ్యాంకుల్లో ఎంత ఉండాలి? రుణాలు ఎంత ఇవ్వాలి? వడ్డీలు ఎంత వసూలు చేయాలి? అన్నవాటిని నిరంతరం నిర్ణయి స్తుంది. మోడీ సర్కార్‌ నోట్లరద్దు నిర్ణయంతో (2016లో) ‘ఆర్బీఐ’ స్వతంత్రత పై మొదటి దెబ్బ పడింది. క్రమక్రమంగా ఆర్బీఐని బలహీనపర్చే విధానాలకు మోడీ సర్కార్‌ తెరలేపింది. నగదు చెలామణి, బ్యాంకింగ్‌పై నియంత్రణ వంటివి ఆర్బీఐ నుంచి కేంద్రం లాగేసుకుంది. ఆ తర్వాత ఆర్బీఐ నిల్వచేసిన ‘నిధుల’పై కన్నేశారు. అంత ఉండాల్సిన అవసరం లేదంటూ…లక్షల కోట్లు తీసుకోవటం మొదలుపెట్టారు.
నగదు నిర్వహణలో ఆర్బీఐ పరిధిని చాలా వరకు తగ్గించారు. రెండు..మూడు నెలలకోసారి రెపో రేట్లు తగ్గించటమనే పనిమాత్రమే మిగిలింది. ఈ పనిని ఈ ఏడాది ఆర్బీఐ నాలుగుసార్లు చేసింది. వడ్డీరేట్లను సవరించటమనే ఒక్కచర్యతో ఏదో జరుగుతుందన్న ఆశ కల్పించారు. మొండి బకాయిలతో దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు చేసిందేమీ లేదు. మరోవైపు చాలినన్ని నగదు నిల్వలు లేక బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోతున్నాయి. ఆర్బీఐ స్వతంత్రత దెబ్బతినటం వల్ల దక్కిన ఫలితాలు ఇవన్నీ. ప్రస్తుతం ఈ సంస్థ విశ్వసనీయతపై అనుమానాలు బలపడుతున్నాయి.

Courtesy Nava telangana..

RELATED ARTICLES

Latest Updates