బాల్యం.. చిక్కి శల్యం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎదుగుదల లోపమున్న చిన్నారుల్లో అత్యధికులు ఆదిలాబాద్లో బరువు తక్కువున్నవారిలో ఎక్కువ మంది జహీరాబాద్ లో దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యయనం హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడి బంగరు బాల్యం వన్నె తగ్గుతోంది.. కళకళలాడాల్సిన వేళ ఆకలితో నకనకలాడుతోంది.. తెలంగాణలో ఐదేళ్లలోపు చిన్నారులను పోషకాహార లోపం వేధిస్తోంది..

ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎసీవీ సుబ్రమణియన్, విలియం జో, రాఖిలి కిమ్లు ‘టాటా ట్రస్టు సహకారంతో దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన అధ్యయనంలో తేలిందిది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు 2018 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘పోషన్ అభియాన్’ పథకం అమలుతీరును వీరు పరిశీలించారు. అధ్యయనాంశాల్లో వెలుగుచూసిన విషయాలు

ఎదుగుదల లోపం

* దేశవ్యాప్తంగా బాలల్లో ఎదుగుదల లోపం తక్కువగా ఉన్న 20 పార్లమెంటు నియోజకవర్గాల్లో సగానికి పైగా కేరళలోనే ఉన్నాయి.

* పిల్లల్లో అత్యధిక ఎదుగుదల లోపమున్న పార్లమెంటు నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని బహరించ్(64శాతం-)కాగా, అత్యల్ప లోపమున్నది కొల్లం(15శాతం)లో.

* తెలంగాణలో ఎదుగుదల లోపం అత్యధికంగా ఆదిలాబాద్(34.8శాతం) పార్లమెంటు స్థానం పరిధిలో | ఉండగా తర్వాత నాగర్ కర్నూల్, జహీరాబాద్, అత్యల్పంగా సికింద్రాబాద్(19.8శాతం)లో నమోదైంది.

* దేశంలో అత్యధికానికి, అత్యల్పానికి మధ్య తేడా :49%

బరువు తక్కువ

* దేశవ్యాప్తంగా.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులు అత్యధికంగా ఝార్ఖండ్ లోని సింఘమ్(61శాతం) పార్లమెంటు నియోజకవర్గంలో.. అత్యల్పంగా జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్(11శాతం)లో ఉన్నారు.

* తెలంగాణలో బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా ఆదిలాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నమోదయ్యారు.

* దేశంలో అత్యధికానికి, అత్యల్పానికి మధ్య తేడా : 50%

 బక్కచిక్కిన నడుము

* దేశం మొత్తమ్మీద నడుము బక్కచిక్కిన పిల్లలు అత్యధికంగా ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్(40శాతం)లో ఉండగా.. అత్యల్పంగా మణిపూర్ లోని ఇన్నర్ మణిపూర్(6శాతం) పార్లమెంటు స్థానం పరిధిలో నమోదయ్యారు.

* రాష్ట్రంలో అత్యధికంగా నడుము బక్కచిక్కిన చిన్నారులున్న నియోజకవర్గాలుగా ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, జహీరాబాద్లు నమోదయ్యాయి.

* దేశంలో అత్యధికానికి, అత్యల్పానికి మధ్య తేడా : 84%

పుట్టుకతోనే తక్కువ బరువు

* తక్కువ బరువుతో పుట్టే చిన్నారులు అత్యధికంగా మధ్యప్రదేశ్ లోని మాండ్ సౌర్(35శాతం)లో ఉండగా.. అత్యల్పంగా మిజోరాం రాష్ట్రంలోని మిజోరాం (4శాతం) పార్లమెంటు స్థానంలో నమోదయ్యారు.

* తెలంగాణలో మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో అత్యధికులు నమోదయ్యారు.

* దేశంలో అత్యధికానికి, అత్యల్పానికి మధ్య తేడా : 31%

రక్తహీనత

* రక్తహీనత అత్యధికంగా ఉన్న చిన్నారులు దాద్రానగర్ హవేలీ నియోజకవర్గంలో 84శాతం మంది.. అత్యల్పంగా కేరళలోని కొల్లం(18శాతం)లో నమోదయ్యారు.

* తెలంగాణలో ఆదిలాబాద్, భువనగిరి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్.. తదితర అన్ని నియోజకవర్గాల్లోనూ 60 శాతానికి పైగా రక్తహీనత బాధిత చిన్నారులున్నట్లుగా అధ్యయనంలో తేలింది. * దేశంలో అత్యధికానికి, అత్యల్పానికి మధ్య తేడా : 66%.

Courtesy Eenadu..

RELATED ARTICLES

Latest Updates