ఆర్‌సెప్‌లో చేరేది లేదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • చైనా డంపింగ్‌పై మెట్టు దిగని మోదీ సర్కార్‌
  • ఫలించిన దేశీయ పరిశ్రమల ఒత్తిడి

బ్యాంకాక్‌: అంతర్జాతీయ ఒప్పందాల కోసం దేశ వాణిజ్య ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రాంతీయ సమ గ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందం మాకొద్దని అదే సదస్సులో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వాణిజ్యంలో ఈ దేశాలతో ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలు, ఆందోళనలు పరిష్కారం కాకుండా ఆర్‌సెప్‌ పై ముందుకు వెళ్లలేమన్నారు. ‘ఆర్‌సెప్‌ ప్రస్తుత ఒప్పందం గతంలో అంగీకరించిన ప్రాథమిక స్ఫూర్తి, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా లేదు. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలను కూడా ఈ ఒప్పందం సంతృప్తికరంగా పరిష్కరించేలా లేదు. ఈ నేపథ్యంలో ఆర్‌సె్‌పలో చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. ఈ నిర్ణ యం ద్వారా వాణిజ్య చర్చల్లో ప్రధాని మోదీ మహా గట్టిపిండం అని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్న మాటల్ని నిజం చేశారు.

ఇవీ భయాలు…ఆసియాన్‌లోని 10 దేశాలతో భారత్‌కు ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎ్‌ఫటీఏ) ఉన్నాయి. ఈ ఒప్పందాల వల్ల భారత్‌ కంటే ఆసియాన్‌ దేశాలే ఎక్కువగా ప్రయోజనం పొందాయి. ఈ దేశాలకు భారత ఎగుమతులు అంతంతమాత్రంగానే పెరిగాయి. ఈ దేశాలు మాత్రం భారత్‌కు తమ సరుకులు, ఉత్పత్తుల ఎగుమతులను గణనీయంగా పెంచుకున్నాయి. 2004లో ఆర్‌సెప్‌ దేశాలతో 700 కోట్ల డాలర్లున్న వాణిజ్య లోటు 2014 నాటికి 7,800 కోట్ల డాలర్ల స్థాయి కి చేరింది. ఇప్పుడు ఆర్‌సెప్‌ ఒప్పందం కింద ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు 90 శాతం వరకు తగ్గించాలి.

అదే జరిగితే దేశీయ పరిశ్రమ, వ్యవసాయం కుదేలవుతుందని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఆర్‌సె్‌పను అడ్డుపెట్టుకుని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు తమ పాడి ఉత్పత్తులను భారత్‌లో డంప్‌ చేసే ప్రమాదం ఉందని దేశీయ పాడి పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది.

15 దేశాలు ఓకే….మరోవైపు భారత్‌ కలిసి రాకున్నా ఆర్‌సెప్‌పై ముందుకు వెళ్లాలని మిగతా 15 దేశాలు నిర్ణయించాయి. ఆస్ట్రేలియా మాత్రం ఆర్‌సె్‌పలో ప్రవేశానికి భారత్‌కు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించింది. భారత్‌ తరఫున లాబీయింగ్‌ చేసిన వియత్నాం, జపాన్‌ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో భారత్‌ మళ్లీ వచ్చి చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపాయి.ఆర్‌సెప్‌ ఒప్పందం భారత్‌కు మేలు చేసుందా? లేదా ? అని ఆలోచిస్తే నాకు సానుకూలమైన సమాధానం లభించలేదు. అందుకే గాంధీజీ సిద్ధాంతాలు గానీ, నా అంత రాత్మగానీ ఆర్‌సెప్‌లో చేరేందుకు అనుమతించడం లేదు.

ప్రధాని మోదీ

చైనానే అసలు భయం !…ఆర్‌సెప్‌ ఒప్పందానికి భారత్‌ నో చెప్పడానికి అసలు కారణం, చైనా వస్తువుల డంపింగ్‌ ప్రమాదమేనని భావిస్తున్నారు. ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేకపోయినా చైనా ఇప్పటికే అనేక వస్తువులను భారత్‌లోకి చౌకగా కుమ్మరిస్తోంది. మరోపక్క మన వస్తువులు తన మార్కెట్లోకి ప్రవేశించకుండా ఏదో పేరుతో అడ్డుగోడలు కడుతోంది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటు చాంతాడులా పెరిగిపోతోంది. ఇప్పుడు ఆర్‌సెప్‌ కూడా తోడైతే దేశీయ పరిశ్రమలకు ఈ మాత్రం రక్షణ కూడా ఉండదని దేశీయ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో భారత ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే వరకు ఈ ఒప్పందానికి దూరంగా ఉండడమే మంచిదని నరేంద్ర మోదీ సర్కార్‌ నిర్ణయించింది.

Courtesy Andhrajyothi…

 

RELATED ARTICLES

Latest Updates