మోడీ హయాంలో గత ఏప్రిల్ నాకు లెక్కల వరకూ చూస్తే దేశంలో మొత్తం 263 విద్వేష దాడులు నమోదయ్యారు. అయితే ఇవి బయటకువచ్చిన సంఘటనలు మాత్రమే. చాలా వాటిని బయటకు రాకుండా ఆధిపత్యవర్గాలవారు తొక్కిపెడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అనేకచోట్ల ఈ విద్వేషప్రభుత్వాలు ఏర్పడ్డ విషయం మనకు తెలిసిందే. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, టర్కీ ఉదాహరణలు. పొలిటికల్ సైంటిస్టులు వీటిని పాప్ లిస్ట్, ఆథారిటేరియన్ ప్రభుత్వాలని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మనవహక్కులకోసం పనిచేస్తున్న కార్యకర్తలు, మేధావులు అనేక దేశాలలో విద్వేషదాడుల మీద అధ్యయనం చేయటానికి, నమోదు చేయటానికి హేట్ క్రైమ్ వాచ్ సంసంస్థల్ని ఏర్పాటు చేశాయి. ఇదే ఒరవడిని భారతదేశంలో కూడా రిటైర్డ్ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, ప్రొఫెసర్లు మానవహక్కుల కార్యకర్తలు పూనుకున్నారు. అధికారికంగా నమోదైన ఫిర్యాదులు, రిపోర్టులు ఇలాంటివి రకరకాల సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించి గణాంకాలను క్రొడీకరణ చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో మూడు రాష్ట్రాల్లో విద్వేషదాడులకు 99 మంది మరణించారని ఈ అధ్యయనంలో తేలింది. మొత్తం 773 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్, జమ్మూకాశ్మీర్ ,జార్ఖంఢ్, చత్తీస్ ఘర్ ,తెలంగాణ ఉత్తరాఖండ్లో ఎక్కువ సంఘటనలు చోటుచేసుకున్నాయి, ఈ 12-13 రాష్ట్రాలకు గానూ ఎనిమిదింటిలో బీజేపీపాలన వచ్చింది. రోహిత్ వేముల, గుజరాత్లోని ఉనా, ఆక్లఖ్ ఒంటి దారుణాలకు నిరసనలు వెల్లువెత్తాయి. కానీ బాధితులకు న్యాయం చేకూర్చడం మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడటం అనేది దాదాపు లేకపోగా సంఘపరివార్ శక్తులు ఈ విద్వేష రాజకీయాలను, హింసాకాండలను మరింత పెంచి పోషిస్తున్నాయి. 2019 ఎన్నికల కోసం మత విద్వేష రాజకీయాలను బిజెపి విజయవంతంగా ఉపయోగించుకున్నది. ఈ హేట్ క్రైమ్ వాచ్, హేట్ ట్రాకర్ వంటి సంప్రదాయాలు మన తెలుగు మీడియాలో కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది.