దండి వెంకట్✍????
దండి వెంకట్ ఆవేదన దండగ కాలేదు ….
బిసి దండు కదిలింది !
గీత కార్మికుడు వెంకన్న గౌడ్ హత్యపై ఉద్యమించలేని బానిస సంఘాలతో ఏమిటి ఉపయోగం…?
బీసి సమాజం ఎంతటి అనైక్యత జీవితం అనుభవిస్తున్నదో… ★ దాని ఫలితంగా అంతటి బానిసత్వంలో మగ్గిపోతున్నదనడానికి అనేక ★ ఘటనలు,సంఘటనలు చూస్తే అర్థమవుతుంది…! తెలంగాణాంధ్రతోపాటు దేశంలోనూ అదే పరిస్థితి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ★ బీసిల్లోని ఉత్పత్తి సేవ కులాలైన వడ్డెర,చాకలి, మంగలి, గూండ్ల(గంగపుత్ర),విశ్వకర్మ, గౌండ్ల (గౌడ్)తదితర ఉత్పత్తి కులాలతోపాటు సంచార అశ్రిత కులాలు అనుభవిస్తున్న అవమానకర జీవితాన్ని ఎస్సీ,ఎస్టీలు సైతం అనుభవించడం లేదంటే అతిశయోక్తి కాదు..
★ లింగాల వెంకన్నగౌడ్ ది ముమ్మాటికీ అగ్రకుల ధూరంకార హత్యే! మూసిపట్లఊరు, మోత్కూర్ మండలం, యాదాద్రిభువనగిరి జిల్లా కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కినప్పుడు కాచుకొని ఉన్న దురహంకారి కొంతం ప్రభాకర్ రెడ్డి ,వాడి భార్య, కొడుకులతో కలిసి సుమారు 45 డిగ్రీలఎండలో తాటిచెట్టు మొదలు వద్ద పెద్ద మంట పెట్టగా,చెట్టుపైన ఉన్న అతను మంట వేడికి తట్టుకోలేక చెట్టుపైనుండి జారి మంటల్లో పడి 90 శాతం కాలిన గాయాలకు గురై మరణించిన ఘటనపై
★ గౌడ కులం ఇతర బీసి కులాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగావిస్తృత పర్చాలసిన విషయాన్ని విస్మరించడం అత్యంత బాధాకరమైనది
★ వెంకన్న గౌడ్ హత్యపై పెద్ద ఎత్తున చేయాలసిన ఉద్యమాన్ని మానసిక బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న బీసి నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది…
★ అంబెద్కర్ భావజాల పునాదిపై నిర్మాణమైన దళిత ఉద్యమం ఈపాటికే సమాజంతనవైపు తిరిగి చూసేవిధంగా
సమరశీలంగా ఉద్యమించేది.. సిద్ధాంత బలమున్న ఉద్యమానికి… ఏ సిద్ధాంతం లేని సమూహానికి ఉండే తేడానేఇది…
★ బీసి ఉద్యమం ఎప్పుడైతే సాహుజీ,ఫూలే,సావిత్రి బాయి, పెరియార్ ల భావజాలంతోపాటు డాక్టర్ బాబాసాహేబ్ సైద్ధాంతికతను బూజాన మోస్తుందో అప్పుడే బీసి సమాజం అధికారసౌదాన్ని అదిరోహిస్తుంది…
దండి వెంకట్✍????
కల్లుగీత కార్మికుడు వెంకన్నగౌడ్ హత్య పైనా స్పందన