
గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వారి బాటలో నడవడమే ప్రతి భారతీయుని విధి అని, అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. గాంధీజీ 152 వ జయంతి సందర్బంగా కైకలూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఈ ఉదయం కైకలూరు పట్టణ కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్ లో, జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహనికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న MLA, DNR గారు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ భారతీయులందరికీ ప్రాతఃస్మరణీ యుడన్నారు.సత్యం-అహింస సాధనాలుగా స్వాతంత్ర్య సముపార్జన చేసిన మహానాయకుడు బాపూజీ అన్నారు. ఆధునిక భారతంలో వారుకలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకులలో ప్రియతమా ముఖ్యమంత్రి ys జగనన్న అగ్రగణ్యుడని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాలలో వాలంటరీల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ స్థాపించి, పరిపాలన ప్రజలకు నేరుగా అందిస్తూ దేశానికే ఆదర్శం గా జగనన్న నిలిచారు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ప్రతి సంక్షేమ పధకం అర్హులు అయిన అక్కచెల్లమ్మలకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు అని, రాష్ట్రంలో ఇండ్లు లేని పేద అక్కచెల్లమ్మలు ఉండకూడదు అని, వాలంటరీల ద్వారా అర్హులను గుర్తించి రాష్ట్రంలో 32 లక్షలు మంది అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇండ్ల నిర్మాణం కొరకు అనుమతులు ఇచ్చారు అని అన్నారు, ఈ రోజు పట్టణంలోని ఆర్యవైశ్యులు, కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాతిపిత గాంధీజీ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషం అని అన్నారు. ఎంపిపి అడివి కృష్ణ మాట్లాడుతూ గాంధీ జయంతి వేడుకల్లో మొట్టమొదటి సారిగా ఒక ప్రజాప్రతినిధిగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, తనకు పదవీ యోగం కల్పించిన ఎమ్మెల్యే DNR గారికి ఋణపడి ఉంటానని గాంధీజీ స్పూర్తితో DNR నాయకత్వం లో ముందుకు వెళ్తానన్నారు. జడ్పీటీసీ కురేళ్ళ బేబీ మాట్లాడుతూ గాంధీజీ నాయకత్వం లో ఎందరో దేశభక్తుల త్యాగాల మూలంగా స్వాతంత్ర్యం లభించిందని..గాంధీజీ బాటలో ఈ దేశం ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సర్పంచ్ D.M. నవరత్నకుమారి మాట్లాడుతూ గాంధీజీ ఆశించిన స్త్రీ సమానత్వ సమాజం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగనన్నఅని మహిళల కు 50 శాతం రిజర్వేషన్లు అమలుతో పాటు వారి రక్షణకు దిశ చట్టం చేసి అమలుచేస్తున్న ఘనత సీఎం జగనన్నదే నన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీజీ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారికి అసోసియేషన్ తరపున ధన్యవాదాల తెలుపుతున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ బి.వి.ఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గూడపాటి జగన్నాధం,బుద్ధా మహాలక్ష్మి,, గాధంసెట్టి వెంకటేశ్వరరావు, కటికన రఘు, పోలవరపు శ్రీనివాసరావు, గొల్లు పాండురంగారావు,, పెనుమూడి నాగరాజు, హరిశ్రీనివాస్, కొత్త నరసింహరావు, తవ్వ భాస్కర్, సోము శివ, సోము మోహనరావు, కొణిజేటి పాండురంగారావు,, కంకిపాటి వెంకటేశ్వర్రావు, వరదా వసంతరాయలు, పొన్నూరు పురుషోత్తం, శ్యామలరావు, మండల చలపతి, మండల శ్రీనివాస్, ప్రసాద్, తోట మాధవ, ఉండ్రామట్ల ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.