ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కోరిన వెంటనే సమగ్ర సమాచారం
  • పారదర్శకత.. జవాబుదారీతనం
  • 2.6 కోట్లకు పైగా వివరాలు
  • తొలిసారిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి
  • ధరణికి తుది రూపు 

ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తంరాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో వ్యవసాయ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో లభ్యంకానుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డుల నమోదు.. నిర్వహణలో సరికొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం ధరణి పోర్టల్‌ను అధికారికంగా గురువారం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో సుమారు 2.6 కోట్లకు పైగా ఆస్తుల వివరాలు లభ్యం కానున్నాయి. క్రయవిక్రయాలతో పాటు వివిధ సేవలకు ఈ పోర్టల్‌నే వేదికగా మార్చింది. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో ఆగిన రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసేలా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

ధరణిలో ఇలా..
పాసుపుస్తకం, 1బి. పహాణీ
పట్టాదారు పాసుపుస్తకం నంబరు లేదా జిల్లా, మండలం, గ్రామం ఖాతా సంఖ్య లేదా సర్వే నంబరు/సబ్‌డివిజన్‌ సంఖ్య నమోదు చేస్తే భూములు వివరాలు వస్తాయి. ఇందులో పట్టాదారు పాసుపుస్తకం, 1బి నమూనా (ఆర్‌ఓఆర్‌), పహాణి/అడంగళ్‌లు ఉంటాయి.
ప్రభుత్వ భూముల గుర్తింపు
జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేస్తే.. గ్రామ పరిధిలో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్‌ భూములు, లావుణిపట్టా, కెనాల్‌/కాలువ, శ్మశానం, రోడ్డు, సీలింగ్‌ పట్టా భూమి స్వభావం, వర్గీకరణ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్‌ విలువ
జిల్లా, మండలం, గ్రామం, సర్వే/సబ్‌డివిజన్‌ నంబరు వంటి వివరాలను నమోదు చేస్తే మార్కెట్‌ విలువ (వాల్యూ) ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఆన్‌లైన్‌లో ఈసీ
ధరణి పోర్టల్‌లో ఈసీ కూడా ఆన్‌లైన్‌లో ఉండటంతో నిర్దేశించిన భూమిపై రుణం/తనఖా వంటివి స్పష్టంగా తెలుస్తాయి. పంట రుణం/ హైపోథికేటెడ్‌ (తనఖా), లోన్‌అకౌంట్‌ నంబరు, రుణం తీసుకున్న తేదీ, రుణం కాలపరిమితి, రుణ మొత్తం, ఏ బ్యాంకు అనే వివరాలతో పాటు లోన్‌ స్టేటస్‌ వంటి వివరాలున్నాయి. రుణాలు పొందేటపుడు, క్రయవిక్రయాల సమయంలో సమాచారం దాచడానికి వీలుపడదు.

ధరణి ప్రత్యేకతలు
* వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఒకేచోట
* పారదర్శకత, జవాబుదారీతనం
* రికార్డులను స్వయంగా పరిశీలించుకునే అవకాశం
* కావాల్సిన వారు డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాటు
* ఏ వివరాలకూ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు
* రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు
* రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే కొన్నవారి పేరుతో రికార్డులో పేరు మార్పు (మ్యుటేషన్‌)
* క్రయవిక్రయాలకు అనుగుణంగా రికార్డుల్లో వెంటనే మార్పులు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తుల పరిరక్షణ
* రెవెన్యూ పాలనలో పారదర్శకత
* అవినీతికి ఆస్కారంలేని విధంగా చర్యలు

ఇంటి నంబరు నమోదు చేస్తే..
ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య లేదా ఇంటి నంబరు నమోదు చేస్తే జిల్లా, మండలం, యజమాని పేరు, భవనం (నివాస/నివాసేతర), వినియోగం వంటి వివరాలు తెలుస్తాయి. జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాల నమోదుతో నిషేధిత ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు.

రెండు కేటగిరీల్లో సేవలు
సేవలను సులభంగా పొందేలా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో వెబ్‌సైట్‌ ఉంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులు అనే రెండు ప్రత్యేక కేటగిరీల్లో ఉన్నాయి. వ్యవసాయ సేవలకు ఆకుపచ్చ రంగు, వ్యవసాయేతర ఆస్తులకు ఎరుపు రంగును కేటాయించారు.

ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తంవ్యవసాయ భూముల సేవలు
* రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌
* భూముల వివరాలు
* నిషేధిత భూములు
* ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌
* స్టాంపు డ్యూటీ కోసం మార్కెట్‌ విలువ
* పట్టా మార్పిడి వినతి
* భూ మార్పిడి వినతి (నాలా)
* వ్యవసాయ ఆదాయం ధ్రువపత్రం
* భూమి విలువ ధ్రువపత్రం

ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తంవ్యవసాయేతర భూముల సేవలు
 రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌
* సర్టిఫైడ్‌ కాపీ
* డ్యూటీ, ఫీజు క్యాలిక్యులేటర్‌
* ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌
* రిజిస్ట్రేషన్‌ సేవల చెల్లింపు
* పబ్లిక్‌ డేటా ఎంట్రీ
* స్లాట్‌ బుకింగ్‌.. స్లాట్‌ రీ షెడ్యూలింగ్‌
* దరఖాస్తు ట్రాక్‌  
 వీక్షణ రసీదు
 యూనిట్‌ రేట్లు  స్టాంపు సేవల చెల్లింపు
 మార్కెట్‌ విలువ   గ్రూపు రిజిస్ట్రేషన్‌ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తం

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates