ర్యాగింగ్ జరగలేదట

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అది ఉత్తర ప్రదేశ్ లోని ఒక మెడికల్ కాలేజీ. గుండు కొట్టించుకున్న వైద్య విద్యార్థులు వరుసగా బారులుతీరి నడుస్తున్నారు. సీనియర్లకు వందనం చేసుకుంటూ పోతున్నారు. వైరల్ అయిన ఈ వీడియో సభ్యసమాజాన్ని కదిలించివేసింది. సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసిన వైనమిది . ఈ ఉదంతం తెలిసిన అధికారులు కాలేజీకి వచ్చి విచారణ జరిపారు. ర్యాగింగ్ ఏమీ జరగలేదని స్వచ్ఛందంగానే  గుండు చేయించుకున్నామని విద్యార్థులు సమాధానమిచ్చారు. అంటే అంత భయమా అన్నమాట. నిజం చెప్పలేని తనం అన్నమాట. కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తాము చదువుకున్నప్పుడు జరిగిన ర్యాగింగ్ తో పోలిస్తే ఇది చాలా స్వల్పమని పేర్కొన్నారు. భారత సుప్రీంకోర్టు ర్యాగింగ్  నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఈ మేరకు చట్టం చేసింది. అయినా దేశంలోని అనేక కాలేజీల్లో యూనివర్సిటీల్లో కొనసాగుతూనే వస్తున్నది. పలుచోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే దేశంలో ఉన్నట్లుగా నిజాన్ని నిర్భయంగా చెప్పలేని వాతావరణం కనిపిస్తున్నది. చాలా ఆందోళనకరమైన విషయం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాలేజీ పై తీవ్రంగా స్పందించింది. సీనియర్ విద్యార్థులందరినీ ఎందుకు సస్పెండ్ చేయకూడదు, ప్రతి ఒక్కరికి భారీగా జరిమానా విధించాలిఅంటూ లేఖ రాసింది.

In a disparaging act of ragging, first-year MBBS students of Uttar Pradesh University of Medical Sciences, Saifai, were allegedly forced to tonsure their heads by their seniors and “bow in reverence” to them.
A video of the incident that has gone viral on the internet. The first-year students are seen moving in a single file with backpacks and saluting their seniors as they pass by in the video.

Vice-Chancellor, Uttar Pradesh University of Medical Sciences, Dr Raj Kumar reacting to the incident said, “We keep a strict vigil on such activities and we have a separate dean social welfare for students. Further, we have an anti-ragging committee to deal with complaints. We also have a special squad which visits every place in University to keep a check over ragging. The students can complain to the anti-ragging committee or even to their wardens.”

The vice-chancellor assured that the cognizance will be taken into the incident and strong action initiated against those involved.
“Strong action will be taken against those who are involved. We have suspended students earlier also. I want to assure juniors that they need not worry,” he said

 

(Courtacy Times of India)

RELATED ARTICLES

Latest Updates