
ఇటు అధికారుల్ని అటు కాంట్రాక్టర్లను సమన్వయం చేయగలగడమే ఒక ప్రజాప్రతినిధిగా తాను చేశానని, నియోజకవర్గంలో పూడిక పనులు చాలావరకు పూర్తి అవడానికి ఇదే కారణం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. ఈ ఉదయం కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన MGNREGS సామాజిక తనిఖీ గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ ఈరోజు ఈ సామాజిక తనిఖీ నిమిత్తం వచ్చిన అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. మనం కైకలూరు లో చేసిన పూడిక గురించి చెప్పడం కంటే ఒక్కసారి అధికారుల్ని తీసుకెళ్లి చూపిస్తే మనం చేసిన పని పూర్తిగా అవగతం అవుతుందని అన్నారు.
గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కైకలూరులో కరకట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వగా తాను సర్పంచ్ గా ఉన్నకాలంలో మెరక చేయించి ఇళ్ళు నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. ఇప్పుడు మనసున్న మారాజు జగనన్న ముఖ్యమంత్రి గా ఉండి పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం చెయ్యడానికి మంచి సంకల్పం చేసిన సమయంలో ఏలూరు రోడ్ లో రహదారిని ఆనుకుని వంద ఎకరాలు ప్రభుత్వం ద్వారా సేకరింపచేసి ఇటు భూములిచ్చిన రైతులకు మంచి రేటు ఇప్పించి, అటు లబ్ధిదారులకు మంచి ఖారీదయిన ప్లాట్స్ ఇప్పించిన తృప్తి కలిగిందని అన్నారు. సేకరించిన చెరువులను సుమారు 8 అడుగుల మేర పూడిక చేయించి అదనపు మంజూరులు తెచ్చి కైకలూరు చరిత్రలో నిలిచిపోయే లే అవుట్ చేసి చరిత్ర సృష్టించాము అన్నారు. ముఖ్యంగా పూడిక చేసిన కాంట్రాక్టర్ రమేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడివికృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీడీఓ వెంకటరత్నం, DWMA APD లు, APO శరణ్, ఆనంద్ లు, EC లు, TA లు, DEO లు సిబ్బంది పాల్గొన్నారు.