
నర్సంపేట
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు: దసరా పండుగ వేడుకల సందర్భంగా ఆలయం వద్ద గిరిజన సర్పంచ్‌ను కొబ్బరికాయ కొట్టనీయకుండా అవమానించారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండలో జరిగింది. సర్పంచ్ బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దసరా వేడుకల్లో భాగంగా పోచమ్మగుడి వద్ద సర్పంచ్ రాము కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లాడు. ఇదే గ్రామానికి చెందిన వంగ సమ్మయ్య, కుకట్ల రవి, కన్నెబోయిన సుధాకర్, గోకు మల్లేష్, గోకు రాజన్న, దొంగల కుమారస్వామి, కుకట్ల కుమారస్వామి అడ్డుకున్నారు. పోచమ్మగుడి వద్ద గిరిజనుడు కొబ్బరికాయ కొట్టేందుకు వీలులేదంటూ దూషించి నెట్టేశారు. దాంతో మనస్తాపం చెందిన రాము తనను కులంపేరుతో దూషించి వేడుకల్లో పాల్గొనకుండా నెట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Courtesy Navatelangana..