- మహిళను చేతబడి చేసి చంపాడని ఆరోపణ
- అంత్యక్రియల వేళ బహిర్భూమికి యువకుడు
- అతడిని అదే మంటల్లోకి నెట్టి సజీవ దహనం
- ఏ పాపం తెలియదన్నా కనికరించలేదు
- మేడ్చల్ జిల్లాలో ఘోరం.. అదుపులో ఇద్దరు
అనేక శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థలు కొలువుదీరిన హైటెక్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలో మూఢ నమ్మకం జడలు విప్పింది. ఆధునిక నాగరిక జీవనం సాగించే భాగ్యనగరానికి శివార్లలోనే అంధవిశ్వాసం కరాళ నృత్యం చేసింది. విషాదంలోంచి పుట్టిన ఓ నిర్హేతుక విద్వేషానికి ఓ యువకుడు నిలువునా దహించుకు పోయాడు. మానవత్వం చితిమంటల్లో కాలిపోయింది.శామీర్‌పేట/శామీర్‌పేట రూరల్, సెప్టెంబరు 19: అక్కడంతా చిమ్మచీకట్లు. అప్పుడే చితికి నిప్పుపెట్టారేమో ఆ చీకట్లను చీల్చుకుంటూ మండుతోంది. ఆ మంటల్లో ఓ మహిళ మృతదేహం కాలుతోంది. పక్కనే కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారు. అంతలో ఆవైపు బహిర్భూమికని ఓ యువకుడు చ్చాడు! అంతే.. అక్కడున్నవారంతా ఆ యువకుడిని పట్టుకొని లాకొచ్చి ఆ చితిమంటల్లో పడేశారు. బాధితుడు బిగ్గరగా కేకలు వేస్తూ చితిమంటల్లో సజీవదహనమయ్యాడు. మేడ్చల్ జిల్లా ఆద్రా్‌సపల్లిలో బుధవారం రాత్రి ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
తమ ఆప్తురాలికి అతడు చేతబడి చేశాడని.. అందుకే ఆమె మృతిచెందిందని వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. అద్రా్సపల్లికి చెందిన గ్యార లక్ష్మి (45) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (24) ఆటో తోలుకుంటూ బతుకుతున్నాడు. ఆంజనేయులు తండ్రి కృష్ణయ్య గతంలో ఊర్లో చేతబడులు చేసేవాడని.. ఆయన్నుంచి ఆంజనేయులు నేర్చుకున్నాడన్న ప్రచారం ఉంది.
లక్ష్మి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. బుధవారం రాత్రి గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. అదే సమయంలో బహిర్భూమి కోసం ఆంజనేయులు ఆ వైపు వెళ్లాడు. లక్ష్మి మృతికి అతడే కారణమని, అందుకే అక్కడ తిరుగుతున్నాడని మృతురాలి సంబంధీకులు భావించారు. అతడిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ‘నేనేమీ తప్పు చేయలేదు. ఆమె చావుకు నేను కారణం కాదు. నన్నేమి చేయొద్దు’ అని అతడు వేడుకున్నా కనికరించలేదు.
అతడి తలపై ఓ బండరాయితో మోది చితిమంటల్లో పడేశారు. ఘటనాస్థలికి క్లూస్‌టీం, ఎస్వోటీ, ఇంటలిజెన్స్ పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు. లక్ష్మికి వరుసకు బావలైన బాల్‌రాం, కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags-Telangana, Medchal,district, women, died, killed, by, black magic, accused, and, youth, thrown, into, funeral, pyre
Courtesy Andhrajyothi..