కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని భాస్కరరావుపేట గ్రామ సర్పంచ్ గా గెలిచిన గద్దే ఆనంద్ కుమార్ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ భాస్కరరావుపేట గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే భాస్కరరావుపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి S I. రాజు, పోకల కోటేశ్వరరావు, దుగ్గిరాల రంగారావు, పెద్దింటి ఏరబాబు, అల్లూరి గోపాలకృష్ణ రాజు, రెమల్లె సుందరరావు, అల్లూరి కృష్ణంరాజు, శ్రీనివాస్, దిలీప్, ఎటుకూరి చంద్రరాజు, భాస్కరరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శేవ దాసు, శ్రీను, మారుతి, ఆనంద్, క్రీస్తురాజు, అబ్రహం, దేవానందం, అర్జున్, ధనరాజు యువకులు తదితరులు పాల్గొన్నారు.