కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామ ఉప సర్పంచ్ గా గెలిచిన బావిశెట్టి నాగేశ్వరరావు (పాము) గారు 10 మంది వార్డ్ మెంబెర్లతో కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ఆటపాక గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే ఆటపాక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగ్గిలపు పెద్దకాపు, కన్న ముసలయ్య, గరికపూడి రాము, జ్యోతి, పాలపర్తి సమర్పణ, మౌనిక, సింధు, కన్న రమాదేవి, కన్న సాంబశివరావు, ప్రసాద్, భద్రాచలం, కూనవరపు సతీష్, మదన్, విజయ్, పెద్దిరాజు, వెంకటేశ్వరరావు యువకులు తదితరులు పాల్గొన్నారు.