లాస్ఏంజెలెస్లో ఘటన
లాస్ఏంజెలెస్, సెప్టెంబరు 1 : గత నెల చివరివారంలో ఓ నల్లజాతీయుడిపై ముగ్గురు పోలీసులు ఏడు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనను మరువకముందే.. అలాంటిదే మరో ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ ఏంజెలెస్ నగరంలో గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు తప్పుడు రిజిస్టరు నంబరు కలిగిన ఓ సైకిల్‌ను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో దానిపై వెళ్తున్న నల్లజాతీయుడు డిజోన్ కిజ్జె(29) సైకిల్‌ను అక్కడే వదిలి.. పరుగెత్తేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు వెంబడిస్తుండగా.. అతడి చేతిలో సంచి కింద పడింది. అందులో ఉన్న సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్‌ను డిజోన్ చేతిలోకి తీసుకునే క్రమంలో జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. తుపాకీ అతడిదేనా? దాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశాడనేది వాస్తవమేనా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఈ ఘటనా స్థలం వద్ద వందలాది మంది చేరి, న్యాయం జరిగేలా చూడాలంటూ నినాదాలు చేశారు.