ఏపీ రాజధాని ఖాతా ఖాళీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మిగిలింది 400 కోట్లే
పనులు చేయాలంటే అప్పులే గతి
సీఆర్డీఏ నివేదిక
అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రాజధాని అమరావతి ఖాతా దాదాపుగా ఖాళీ అయింది. వచ్చిన నిధులు వచ్చినట్లే గత ఐదేళ్ల కాలంలో ఖర్చు అయి పోయాయి. దీంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వా నికి రాజధాని నిర్మాణం కోసం నామమాత్రపు నిధులే అందుబాటులో ఉన్నాయి. సిఆర్‌డిఎ ఇటీవల రూపొందించి, ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో ఇలా మిగిలిన నిధులు 406 కోట్ల రూపాయలు మాత్రమేనని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చే అవకాశం లేకపోవడంతో రాజధానిలో ఏ పనులు చేపట్టాలనా అప్పులు చేయడం మినహా మరో మార్గం లేని స్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతో పాటు, ఇతర రుణ వితరణ సంస్థలు రాజధాని ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించ డంతో భవిష్యత్‌లో అప్పుల రూపంలోనైనా నిధులు అందుబాటులోకి రావడం సందేహమే అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది! పనులన్నింటిని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించి ఉండటంతో ఇప్పటి కిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే పనులు తిరిగి కొనసాగించాలని నిర్ణయిస్తే మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్న నిధులు శరవేగంగా ఖర్చు కావడం ఖాయమని అంటున్నారు.
అప్పుల రాజధానే..
రాజధాని నిర్మాణంలో అప్పుల వాటానే ఎక్కువ! వివిధ వనరుల ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 8419.31 కోట్ల రూపాయలు వచ్చినట్లు సిఆర్‌డిఎ పేర్కొంది. ఈ మొత్తంలో 4960.03 కోట్ల రూపాయలు అప్పులు కావడం గమనార్హం, రాజధాని బ్యారడ్ల అమ్మకాల ద్వారా రెరడు వేల కోట్లు, ఆరధ్రాబ్యారకు, ఇరడియన్‌ బ్యారకు, విజయ బ్యారకుల ద్వారా 1862 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం సమీకరించింది. మరికొన్ని మార్గాల ద్వారా 1098 కోట్ల రూపాయలను రుణంగా సేకరించినట్లు సిఆర్‌డిఎ తెలిపింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది. ఇతర గ్రాంట్ల రూపంలో 1096 కోట్లను విడుదల చేసింది. వివిధ పరిణామాల నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఇక ఇయ్యవలసిందేమి లేదని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్‌ నిర్మా ణాల కోసం రుణ వితరణ సంస్థలను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేని స్థితి ఏర్పడింది.
పనులకు 5,600 కోట్లు
వివిధ వనరుల ద్వారా వచ్చిన నిధుల్లో రాజధానిలో చేపట్టిన వివిధ పనుల కోసం 5,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సిఆర్‌డిఎ తెలిపిది. కన్సల్టెన్సీ ఛార్జీల కోసం 321 కోట్లు, భూ సమీకరణ కోసం 1310 కోట్లు ఖర్చు చేశారు. మిగిలినదంతా పూర్తిగా అనుత్పాదకమే! దీనితో కూడా కలుపుకుంటే 8,415 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సిఆర్‌డిఎ తేల్చింది. కన్సల్టెరట్లకు చెల్లిరచిన ఏకంగా 321 కోట్లు ఖర్చు కావడం పట్ల అధికార వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. సిరగపూర్‌, చైనా, జపాన్‌, జర్మనీ వంటి దేశాల్లో నిపుణులను ఆహ్వానిరచి వారి నురచి వివిధ డిజైన్లను తీసుకునేరదుకే ఇరత మొత్తం ఖర్చు చేయడంపై అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Nava telangana..

RELATED ARTICLES

Latest Updates