భారతదేశంలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లో రెండో ఒమిక్రాన్ సోకి 73 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ ఇటీవలే నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా వచ్చినప్పటి నుంచీ ఆస్పత్రిలో ఉంటున్నాడు. డిసెంబరు 23న కరోనా నెగెటివ్ వచ్చింది. కానీ డిసెంబరు 25న ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అనంతరం చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. పోస్ట్ కోవిడ్ న్యుమోనియా ప్రభావం వల్లే అతడ మరణించాడని వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు మృతుడికి అధిక మధుమేహం, రక్తపోటు, సమస్యలు కూడా ఉన్నాయని రాజస్థాన్ వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

భారతదేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 23 రాష్ట్రాల్లో 1,270 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 374 మంది కోలుకోగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అక్కడ 450 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 320 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో, 109 కేసులతో కేరళ మూడో స్థానంలో నిలిచింది. 62 కేసులతో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.
Omircon Covid 19